కృత్రిమ మేధస్సు (ఏఐ)తో ఉద్యోగాలకు భారీగా ఎసరు వచ్చేలా ఉందని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్ మాన్ సాక్స్ అంచనావేసింది. శక్తివంతమైన ఈ సాంకేతికత భవిష్యత్తులో అనేక ఉద్యోగాలను తొలగిస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు గోల్డ్మన్ సాచ్స్ నివేదిక ప్రకారం 300 మిలియన్ల ఉద్యోగాలు (30 కోట్ల ఉద్యోగాలు) ఏఐ ద్వారా ప్రభావితం కావచ్చని అంచనా వేసింది. ఏఐ దాదాపు 300 మిలియన్ల (30 కోట్లు) పూర్తికాల ఉద్యోగాలను భర్తీ చేయగలదని నివేదిక పేర్కొంది.
అమెరికా యూరప్ రెండింటిలోనూ వృత్తిపరమైన పనులపై డేటాను ఉపయోగించి ప్రస్తుత ఉద్యోగాలలో దాదాపు మూడింట రెండు వంతులు కొంతమేరకు ఏఐ ఆటోమేషన్కు గురవుతున్నాయని.. ప్రస్తుత పనిలో నాలుగింట ఒక వంతు వరకు భర్తీ చేయగలదని మేము కనుగొన్నాము" గోల్డ్ మన్ ఒక పరిశోధనా పత్రంలో పేర్కొంది. సాంకేతిక పురోగతితో కొత్త ఉద్యోగాలు కష్టమని.. అయితే ఇది చివరికి ప్రపంచ జీడీపీని 7 శాతం వరకు పెంచుతుందని నివేదిక తెలిపింది.
చాట్ జీపీటీ వంటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు మానవ ఉత్పత్తికి సమానమైన కంటెంట్ను సృష్టించగలవు. రాబోయే దశాబ్దంలో ఉత్పాదకత దీనివల్ల మరింతగా విజృంభించగలదని నివేదిక పేర్కొంది.
1940లో చేసిన కార్మికుల్లో నేడు 60 శాతం మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. 40శాతం సాంకేతిక ఆక్రమించిందని.. పరిశోధన నివేదిక పేర్కొంది. అయితే 1980ల నుండి వచ్చిన సాంకేతిక మార్పు దాని కంటే వేగంగా కార్మికులను స్థానభ్రంశం చేసింది.
ఆర్టిఫిషయన్ ఇంటెలిజెన్స్ తో మునుపటి ఇన్ఫర్మేషన్-టెక్నాలజీ పురోగతి లాగా ఉంటే అది సమీప కాలంలో ఉపాధిని తగ్గిస్తుందని నివేదిక తెలిపింది.
-ఏఐతో ప్రమాదంలో ఉద్యోగాలు
నివేదిక ప్రకారం ఏఐ రాకతో వివిధ రంగాలపై ప్రభావం కూడా గణనీయంగా మారుతుంది. అడ్మినిస్ట్రేటివ్ చట్టపరమైన రంగాలు 46 శాతం అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు 44 శాతం చట్టపరమైన ఉద్యోగాలను ఏఐ ద్వారా భర్తీ చేయబడుతాయి. భౌతికంగా చేసే ఇంటెన్సివ్ వృత్తులు ఏఐ నుంచి తక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటాయి. రైటర్లు వెబ్ డిజిటల్ డిజైనర్లు గణిత శాస్త్రజ్ఞులు ట్యాక్స్ డిపార్టెంట్ బ్లాక్చెయిన్ ఇంజనీర్లు అనువాదకులు రచయితలు అత్యంత ప్రమాదంలో ఉన్నారని తేలింది. వీరిని చాట్ జీటీపీ భర్తీ చేస్తుందని పరిశోధన నిగ్గుతేల్చింది. సాఫ్ట్వేర్ రంగానికి ఎఫెక్ట్ అని తేలింది. చాట్ జీపీటీతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయవచ్చని నిరూపితమైంది. కొన్ని వృత్తులు పెద్ద ప్రమాదంలో ఉన్నప్పటికీ సగటున 20 శాతం మంది ఉద్యోగులు తమ వృత్తికి చాట్ జీపీటీతో ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.