Begin typing your search above and press return to search.

18మంది వచ్చేశారట..పది మంది వెయిటింగ్?

By:  Tupaki Desk   |   26 Aug 2015 9:57 AM IST
18మంది వచ్చేశారట..పది మంది వెయిటింగ్?
X
ఆ మధ్య జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో ఒక పాక్ తీవ్రవాదిని సజీవంగా అక్కడి స్థానికులు పట్టుకోవటం తెలిసిందే. తన గురించి.. తనకున్న హిందూ వ్యతిరేకత గురించి చెప్పి.. హిందువులను చంపేయటం తనకెంత సరదా అంటూ అతగాడు (నవేద్ అలియాస్ ఉస్మాన్) చెప్పిన మాటలు విని అందరూ విస్మయానికి గురయ్యారు. చిన్న కుర్రాడి నోటి నుంచి వచ్చిన భయంకరమైన వాస్తవాలు గగుర్పాటుకు గురి చేశాయి.

అతన్ని విచారిస్తున్న అధికారులకు కీలకమైన విషయాలెన్నో తెలుస్తున్నాయట. తాజాగా అతగాడు అధికారులకు చెప్పిన వివరాల్లో.. తనతో పాటు దేశంలోని 18 మంది వచ్చారని.. మరో పది మంది భారత్ లోకి అక్రమంగా చొరబడటానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడని చెబుతున్నారు. పాక్ అక్రమిత కాశ్మీర్ లోని షేర్ ఖాన్ గ్రామంలో జరుగుతోన్న క్యాంప్ లో ప్రస్తుతం వారు ఉన్నారన్నారు. భారత్ లోకి ప్రవేశించాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదని.. ఆగస్టు 28న భారత్ లో జరిగే 1965 యుద్ధ విజయ వార్షికోత్సవం నాడు దేశంలో దాడులకు దిగాలన్నది తమ వ్యూహాంగా వెల్లడించినట్లు సమాచారం.

భారత్ లోకి వచ్చిన నవేద్ కు సహకరించిన ట్రక్కు డ్రైవర్ ను అరెస్ట్ చేయగా.. ఇక.. అతనికి ఆశ్రయం ఇచ్చిన వారికి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నవేద్ ను సజీవంగా పట్టుకోవటంతో.. భారత్ లో ఉండి.. భారత్ కు ద్రోహం చేస్తున్న పలువురి వివరాలు బయటకు వస్తున్నాయి.