Begin typing your search above and press return to search.
పెద్దాయన బసలో 11 పాములు పట్టారు
By: Tupaki Desk | 4 July 2015 9:46 AM ISTదేశ ప్రధమ పౌరుడు ప్రణబ్‌ముఖర్జీ వర్షాకాల విడిది కోసం సికింద్రాబాద్‌లోని బల్లారం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఉండే వసతి గృహంలో పాములు పట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ప్రధమ పౌరుడు బస చేసిన చోట మొత్తంగా 11 పాములు పట్టుకొన్నారు. వాటిని జూ పార్కుకు అప్పగించారు. రాష్ట్రపతి లాంటి వీవీఐపీ బస చేసే చోట ఇంత పెద్దఎత్తున పాములు పట్టుబడటం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. పట్టుకున్న పాముల్లో రెండు తాచుపాములు.. ఒక కోబ్రా ఉన్నట్లుగా చెబుతున్నారు.
రాష్ట్రపతి బస చేసిన బల్లారం వసతి గృహానికి ఏడాదిలో ఒకట్రెండుసార్లు మాత్రమే విడిది కోసం వస్తుంటారు. ఏడాది పొడుగునా.. పాములు పట్టుకోవటం లాంటి చర్యలు తీసుకుంటే.. ఈ బెడద ఉండదన్న అభిప్రాయం ఉంది. వీవీఐపీ బస చేసిన చోట ఇంత పెద్ద సంఖ్యలో పాములు పట్టుకోవటం కాస్త దృష్టి సారించాల్సిన అంశమే సుమా.