Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : హద్దులు దాటి అందాల ఆరబోత

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా కెరీర్‌ ఆరంభంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నా కూడా ఆ తర్వాత పలు క్రేజీ మూవీస్ లో కనిపించింది.

By:  Tupaki Desk   |   14 Sep 2023 11:26 AM GMT
పిక్ టాక్ : హద్దులు దాటి అందాల ఆరబోత
X

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా కెరీర్‌ ఆరంభంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నా కూడా ఆ తర్వాత పలు క్రేజీ మూవీస్ లో కనిపించింది. ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. తమిళ్ లో కూడా ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించింది.

టాలీవుడ్‌ లో టైర్ 2 హీరోలకు మోస్ట్‌ వాంటెడ్ గా నిలిచిన రాశి ఖన్నా అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు స్టార్‌ హీరోయిన్స్ కు పోటీ అన్నట్లుగానే ఉంటుంది. స్కిన్‌ షో విషయం లో ఎప్పుడు కూడా ముందు ఉండే ఈ అమ్మడు, చాలా తక్కువ మంది హీరోయిన్స్ మాదిరిగా తన ఫిజిక్ ను చాలా అందంగా చూపిస్తుంది అంటూ అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు.

తాజాగా మరోసారి రాశి ఖన్నా తన అందాల ఆరబోత ఫోటోలతో వైరల్‌ అవుతోంది. ఈసారి న్యూడ్ బ్యాక్ బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టింది. ఆకట్టుకునే ఫిజిక్‌ రాశి ఖన్నా సొంతం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు కాస్త లావుగా ఉన్న రాశి ఖన్నా ఈ మధ్య బరువు తగ్గి నాజూకుగా మారింది.


హద్దులు దాటినా కూడా వల్గర్ గా కాకుండా చాలా అందంగా రాశి ఖన్నా కనిపిస్తూ ఉంటుంది అనడంలో సందేహం లేదని ఈ ఫోటోలతో నిరూపితం అయ్యింది. రాశి ఖన్నా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ లో ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. ఇలాంటి ఫోటోలతో మళ్లీ టాలీవుడ్ లో బిజీ అయ్యేనో చూడాలి.

ప్రస్తుతం తమిళంలో ఒకటి రెండు సినిమాలు చేస్తున్న రాశి ఖన్నా తెలుగు లో మాత్రం చాలా రోజులుగా చర్చలకే పరిమితం అవుతుంది. త్వరలోనే ఈ అమ్మడు కొత్త సినిమాను టాలీవుడ్‌ లో కమిట్ అవుతుందేమో అంటూ ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు.