ఆంధ్ర పౌరులమని చెప్పుకోడానికి సిగ్గుగా ఉంది: ఆస్ట్రేలియా ఎన్నారైలు
అవును.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైనా ఇంకా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ఆస్ట్రేలియా ఎన్నారైలు.. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
By: Tupaki Desk | 4 Jun 2025 6:15 PM ISTసూపర్ సిక్స్ సహా సుమారు 143 హామీలతో ప్రజలను నమ్మించి, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. ఆ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఆ హామీలను మాత్రం అమలుచేయలేదని వైసీపీ మండిపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల తరుపున వైసీపీ.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన జూన్ 4ను "వెన్నుపోటు దినం"గా పాటించాలని నిర్ణయించింది.
అవును.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైనా ఇంకా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ఆస్ట్రేలియా ఎన్నారైలు.. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇందులో భాగంగా... ఆంధ్ర పౌరులమని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని అన్నారు. ఈ ఏడాది కాలంలో ఏపీ ప్రజల బాధలను చూస్తుంటే కడుపుతరుక్కుపోతుందని తెలిపారు.
తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాలను చూసి చలించిపోతున్నామని.. ఈ రాక్షస పాలనను ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నాలుగు సంవత్సరాల పాటు మోయాల్సిరావటం వారి దురదృష్టమని ఆస్ట్రేలియా ఎన్నారైలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ తో కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే... ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాధించలేదని చెప్పిన ఆస్ట్రేలియా ఎన్నారైలు... వైసీపీ అధినేత జగన్ పిలుపుమేరకు జరిపిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో... వైసీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి, హరి ఎడనపర్తి, దూడల లోక కిరణ్ రెడ్డి, కృష్ణ చైతన్య కామరాజు, బుర్ర ముక్కు రాజగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.
