సూర్యతో పీరియాడిక్ ఫిల్మ్..మరో 'పులి' కాదుగా?

Tue Nov 29 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

suriya and Siruthai Siva Periodic movie

గతంతో పోలిస్తే ఇప్పడు టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు అంతా పాన్ ఇండియా జపం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రతీ క్రేజీ స్టార్ హీరో భారీ స్పాన్ వున్న లార్జర్ దెన్ లైఫ్ వున్న పీరియాడిక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ తరహా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సొంతం చేసుకుంటూనే స్టార్ హీరోలకు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ని తెచ్చిపెడుతున్నాయి. దాంతో ప్రతీ హీరో పాన్ ఇండియా .. పీరియాడిక్ మూవీల జపం చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే ఈ తరహా సినిమాల నిర్మాణం ఊపందుకుంది.కోలీవుడ్ లో ఈ ట్రెండ్ ఇటీవలే మొదలైంది. రీసెంట్ గా ది గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తన గత 30 ఏళ్లుగా తన కలల ప్రాజెక్ట్ గా భావించి అనేక రకాలుగా వెండితెరపై ఆవిష్కరించడానికి విశ్వప్రయత్నాలు చేసిన మణిరత్నం ఎట్టకేలకు ఈ ఏడాది తన కలని `పొన్నియిన్ సెల్వన్ 1`తో నిజం చేసుకున్నారు. ప్రముఖ రచయిత కల్కీ కృష్ణమూర్తి నవల `పొన్నియిన్ సెల్వన్` ఆధారంగా ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించారు. రీసెంట్ గా ఫస్ట్ పార్ట్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

పార్ట్ 2 వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ అందించిన ధైర్యంతో తమిళంలో సూర్య విక్రమ్ లు హీరోలుగా పీరియాడిక్ మూవీస్ మొదలయ్యాయి. ఇందులో సూర్య 42పై అందరి దృష్టి పడింది. సూర్య హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో ఓ భారీ పీరియాడిక్ మూవీని ప్రారంభించిన విషయం తెలిసిందే. యువీ క్రియేషన్స్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లు ఈ మూవీని నిర్మిస్తున్నాయి. 2డీతో పాటు 3డీ ఫార్మాట్ లోనూ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ దిషా పటానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని భారీ స్థాయిలో 10 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మోషన్ పోస్టర్ లో హీరో సూర్య కింగ్ లా డిఫరెంట్ మేకోవర్ లో కనిపించిన తీరు ఆకట్టుకుంది. సోమవారం చెన్నైలో ఈ మూవీ తాజా షెడ్యూల్ ని ప్రారంభించారు. సూర్యతో పాటు ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న భారీ పీరియాడిక్ ఫిల్మ్‌గా ఈ మూవీని సిరుతై శివ తెరకెక్కిస్తున్నాడు.

అంతా బాగానే వుంది కానీ దర్శకుడు సిరుతై శివ డైరెక్టర్ అనగానే ఎక్కడో కొడుతోందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇంత వరకు కమర్షియల్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేసిన శివ .. సూర్యతో పీరియాడిక్ డ్రామాని ఎలా తీస్తాడో అని సూర్య ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట. సినిమా ప్రకటన సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఇంప్రెసీవ్ గా అనిపించలేదని ఓ హారర్ సినిమా మోషన్ పోస్టర్ లా వుందని మోషన్ పోస్టర్ తో ఆకట్టుకోలేకపోయిన సిరుతై శివ ఇక సినిమాని ఎలా తీస్తాడా? అని అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట.

గతంలో  పీరియాడిక్ ఫాంటసీ కథతో దళపతి విజయ్ హీరోగా శ్రీదేవి కీలక పాత్రలో చింబుదేవన్ `పులి` మూవీని రూపొందించిన విషయం తెలిసిందే. భారీగా ప్రచారం చేసి హైప్ కి క్రియేట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని చవి చూసింది. విజయ్ కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫలితమే ఇప్పడు సూర్య ఫ్యాన్స్ ని భయపెడుతోందట. మరి సిరుతై శివ ఫ్యాన్స్ భయాల్ని పోగొట్టి అనుకున్నట్టుగానే సూర్య 42తో మ్యాజిక్ చేస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.