Begin typing your search above and press return to search.
వార్ 2: తారక్ పైనే డౌట్స్?
By: Tupaki Desk | 30 May 2023 5:00 AMయాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా ఎన్నో విభాగాల్లో అదరగొడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీలో బెస్ట్ ఆల్‌రౌండర్ అనిపించుకుంటోన్నాడు బడా హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభం నుంచీ తెలుగు చిత్రాలకే పరిమితం అయిన అతడు.. RRRతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలనే ప్రకటిస్తున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. స్పై థ్రిల్లర్ జోనర్‌లో వచ్చి సూపర్ హిట్టైన 'వార్' సీక్వెల్ ద్వారానే అతడు ఎంట్రీ ఇస్తున్నాడు. 'వార్ 2' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ బడా హీరో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నాడు. ఈ మూవీని 'బ్రహ్మాస్త్ర' ఫేం అయాన్ ముఖర్జీ తెరకెక్కించబోతున్నాడు.
'వార్ 2' సినిమాలో ఎన్టీఆర్ - హృతిక్ కలిసి నటిస్తున్నారన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచి వీళ్లిద్దరినీ పలు విభాగాల్లో పోలుస్తూ రకరకాల చర్చలు తెరపైకి తీసుకు వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్ అయిన హృతిక్‌ను తారక్ మ్యాచ్ చేయగలడా అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా వైరల్ అవుతోన్న ఓ వీడియో నందమూరి ఫ్యాన్స్‌లోనూ డౌట్లు పెంచేసింది.
తాజాగా దుబాయ్‌లో ఐఫా అవార్డుల కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇందులో ఉత్తమ నటుడిగా హృతిక్ రోషన్ అవార్డును అందుకున్నాడు. ఇది తీసుకున్న తర్వాత హోస్టుల కోరిక మేరకు అతడు స్టేజ్‌పై ఓ పాటకు డ్యాన్స్ చేశాడు. అందులో హృతిక్ తనదైన శైలిలో గ్రేస్ మూమెంట్లతో అలరించాడు. ఈ వీడియో చూసే ఎన్టీఆర్ అతడిని మ్యాచ్ చేస్తాడా అని డౌట్లు వస్తున్నాయి.
వాస్తవంగా మాట్లాడుకుంటే.. ఎన్టీఆర్.. హృతిక్ పర్సనాలిటీని మ్యాచ్ చేయకపోవచ్చు.. కానీ డ్యాన్స్‌లో మాత్రం పోటీ ఇవ్వగలడు అని చెప్పొచ్చు. అంతేకాదు, యాక్టింగ్‌లో అయితే హృతిక్ పక్కన ఉన్నా కనిపించకుండా చేయగల సత్తా తారక్‌కు ఉందని చెప్పుకోవచ్చు.
అంతలా అతడు నటనలో ఇండియాలోని ఏ నటుడినైనా డామినేట్ చేయగలడు. కాబట్టి ఫ్యాన్స్ ఏమాత్రం టెన్షన్ పడనవసరం లేదనే చెప్పాలి.