Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పై విల‌న్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్

By:  Tupaki Desk   |   17 May 2022 4:30 PM GMT
ఎన్టీఆర్ పై విల‌న్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పై త‌మిళ డైరెక్ట‌ర్‌, న‌టుడు, విల‌న్ స‌ముద్ర‌ఖ‌ని సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ కు దేశ రాజ‌కీయాల‌పై వున్న ప‌ట్టుకు, ఆయ‌న నాలెడ్జ్ కి ఫిదా అయిపోయిన స‌ముద్ర ఖ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు రాజ‌కీయాల‌పై మంచి ప‌ట్టువుంద‌న్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఏ క్ష‌ణం టీడీపీ పార్టీ ప‌గ్గాలు అందుకుంటే ఆ క్ష‌ణం ఆయ‌న ముఖ్య‌మంత్రి అవుతారంటూ ఫ్యాన్స్ చెబుతుంటారు.

2009 ఎల‌క్ష‌న్ ల స‌మ‌యంలో నారా చంద్ర‌బాబు నాయుడు పిలుపు మేర‌కు ఎన్టీఆర్ పార్టీ ప్రచారం కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అన్న‌గారు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు గారిని త‌ల‌పిస్తూ ఖాకీ బ‌ట్ట‌లు ధ‌రించి ప్ర‌చారం చేశారు. అయితే తిరిగి వ‌స్తుండ‌గా సూర్య‌పేట స‌మీపంలో రోడ్డు ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో అప్ప‌టి నుంచి రాజ‌కీయాల‌కు, టీడీపీకి దూరంగా వుంటూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం టీడీపీ ఎదుర్కొంటున్న స‌వాళ్ల నేప‌థ్యంలో మ‌ళ్లీ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాలంటూ ఫ్యాన్స్ చాలా కాలంగా డిమాండ్ చేస్తూనే వున్నారు.

కానీ ఎన్టీఆర్ మాత్రం వారి డిమాండ్ కి పెద్ద‌గా రియాక్ట్ కావ‌డం లేదు. అయితే రాజ‌కీయాల‌కు దూరంగా వుంటున్నా దేశ రాజ‌కీయాల‌పై మాత్రం పూర్తి అవ‌గాహ‌న‌తో వుంటున్నార‌ట‌.

ఈ విష‌యాన్ని తాజాగా న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో వెల్లడించ‌డం ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. బిజీ షెడ్యూల్ లో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నా ఎన్టీఆర్ కు దేశ రాజ‌కీయాల‌పై మంచి ప‌ట్టువుంద‌ని, రాజ‌కీయాల‌పై ఆయ‌న‌కున్న నాలెడ్జ్ నెక్స్ట్ లెవెల్ అంటూ స‌ముద్రఖ‌ని చెప్పుకొచ్చారు.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌పైనే కాకుండా త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై కూడా ఆయ‌న‌కు పూర్తి అవ‌గాహ‌న వుంద‌ని తెలిపారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు డీఎంకె విజ‌యం సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని చెప్పార‌ని, రిజ‌ల్ట్ త‌రువాత క‌లిస్తే నేను చెప్పిందే జ‌రిగింది అని అన్నార‌ని, అంతే కాకుండా ఎన్టీఆర్ తో మాట్లాడుతూ కూర్చుంటే ఆ వైడ్ చాలా డిఫ‌రెంట్ గా వుంటుంద‌ని, సొసైటీ, రాజ‌కీయాల‌పై ఆయ‌న అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల‌ర‌ని స‌ముద్ర‌ఖ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రి పాలిటిక్స్ పై ప‌ట్టు సాధించిన ఎన్టీఆర్ త్వ‌ర‌లో రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

ఇదిలా వుంటే కొర‌టాల శివ‌తో ఎన్టీఆర్ చేయ‌బోతున్న 30వ సినిమా దేశ రాజ‌కీయాల నేప‌థ్యంలో రూపొంద‌బోతోంది. స‌మ‌కాలీన రాజ‌కీయ అంశాల‌ని చ‌ర్చిస్తూ క‌మ‌ర్షియ‌ల్ వేలోనే మంచి సందేశాన్ని అండ‌ర్ క‌రెంట్ గా అందించ‌బోతున్నార‌ట‌. మ‌రి ఇదే ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి బాట వేస్తుందో చూడాలి అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు.