విక్రమ్ @75.. అయినా బోర్ కొట్టట్లేదు!

Tue Aug 16 2022 20:00:01 GMT+0530 (IST)

Update News On Vikram Movie

నటన ప్రపంచంలో లోకనాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కమల్ హాసన్ చాలాకాలం తర్వాత విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయ అందుకున్నాడు. అంతకు ముందు వరకు వరుస పరాజయలతో నిర్మాతగా కూడా కొన్ని నష్టాలు ఎదుర్కొన్న కమల్ హాసన్ ఇప్పుడు విక్రమ్ సినిమాతో మాత్రం మంచి గుర్తింపును మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా  భారీ స్థాయిలో లాభాలను సొంతం చేసుకున్నాడు.విక్రమ్ సినిమా అసలు ఈ స్థాయిలో సక్సెస్ అవుతుంది అని మొదట ఎవరు ఊహించలేదు. కానీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ విడుదలకు ముందే ఈ సినిమా కమలహాసన్ కెరీర్ లోనే ఒక సెన్సేషన్ గా నిలుస్తుంది అని చాలా నమ్మకంతో చెప్పాడు.

ఇక అనుకున్నట్లే సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంది. కేవలం 17 రోజుల్లోనే 150 కోట్ల కలెక్షన్స్ అందుకుని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇక బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డును కూడా తమిళంలో బ్రేక్ చేసేసింది. ఈ సినిమా మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లు 400 కోట్ల రూపాయల మార్కును దాటాయి. ఇప్పుడు కూడా ఈ సినిమా థియేటర్లలో జోరు కొనసాగిస్తోంది. ఆసక్తికరంగా జూలై 8న OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ + హాట్‌స్టార్‌లో చిత్రం విడుదలైనప్పటికీ థియేటర్లలో డ్రీమ్ రన్ కొనసాగుతోంది. సినిమా వచ్చి 75 రోజులు అయినప్పటికీ అలాగే ఓటీటీ లో విడుదలైనప్పటికీ కూడా ఇంకా థియేటర్లో సందడి చేస్తోంది అంటే ఒక విధంగా ఇది ఆశ్చర్యకరమైన విషయం.

అసలే థియేటర్లలో సినిమా చూడడానికి జనాలు రావడం లేదు. ఈ రోజుల్లో 50 రోజులు నడవడం కూడా అసాధ్యమే అని అనుకుంటున్న సమయంలో విక్రమ్ సినిమా ఈ తరహా పాత రికార్డును అందుకోవడం విశేషం.

ఇక విక్రమ్ సినిమాలో కమలహాసన్ మాత్రమే కాకుండా విజయ్ సేతుపతి నటన ఫాహాఫ్ ఫాజిల్ యాక్టింగ్ స్కిల్స్ అలాగే సూర్య స్పెషల్ రోలెక్స్ రోల్ కూడా ఎంతో బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాకు కొనసాగింపుగా మరిన్ని కథలను తెరపైకి తీసుకురానున్నట్లు లోకేష్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.