Begin typing your search above and press return to search.

NTR 30: మళ్ళీ గ్యాప్ ఇచ్చాడు

By:  Tupaki Desk   |   29 May 2023 10:18 AM GMT
NTR 30: మళ్ళీ గ్యాప్ ఇచ్చాడు
X
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ షూటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీ లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఈ సినిమాకి సంబందించిన కీలక సీక్వెన్స్ ని మొన్నటి వరకు తెరకెక్కించారు. మరల జూన్ మొదటి వారంలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.

ఈ వారం రోజులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కోసం సిద్ధమైపోయాడు. తాజాగా షార్ట్ వెకేషన్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఎయిర్ పోర్ట్ లో భార్య, పిల్లలతో కలిసి ఎన్టీఆర్ కారు దిగి వెళ్తోన్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో దేవర మూవీకి తారక్ మళ్ళీ గ్యాప్ ఇచ్చాడనే మాట వినిపిస్తోంది.

అయితే ఉన్న గ్యాప్ లోనే ఈ వెకేషన్ ప్లాన్ చేసాడా లేక షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చి వెళ్ళిపోయాడా అనేది క్లారిటీ లేదు. అయితే తారక్ వచ్చేలోపు దేవర నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసి కొన్ని కాంబినేషన్స్ కి సంబందించిన సీక్వెన్స్ ని కొరటాల తెరకెక్కించనున్నారంటా.

ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏది ఏమైనా నవంబర్ ఆఖరుకి దేవర మూవీని తారక్ కంప్లీట్ చేయడానికి కమిట్ అయ్యాడు.

అది కంప్లీట్ అయిన తర్వాత హిందీలో యష్ రాజ్ ఫిలిమ్స్ లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. ఈ మూవీ కోసం మూడు నెలల కాల్ షీట్స్ ని తారక్ ఇచ్చారంట. ఈ నేపథ్యంలో దేవర మూవీని ఆ టైమ్ కి ఫినిష్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

ఇక వచ్చే ఏడాది వేసవిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ పట్టలెక్కుతుంది. ఈ మూవీ హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ప్రశాంత్ యూనివర్స్ చిత్రాలలో భాగంగానే తెరకెక్కుతుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నారు.