మాస్ డైరెక్టర్ తో సూర్య మరో ప్రయోగం.. 2 పార్ట్స్!

Tue May 24 2022 12:00:01 GMT+0530 (IST)

Surya another experiment with Mass Director

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న సూర్య తెలుగులో కూడా స్టార్ హీరోల స్థాయిలో గుర్తింపు అందుకుంటున్నాడు. అయితే బాక్సాఫీస్ పరంగా మాత్రం సూర్య హిట్ చూసి చాలా కాలమైంది. నటుడిగా తన స్థాయి అంతకంతకూ పెరుగుతూనే ఉంది కానీ కమర్షియల్గా మాత్రం పూర్తి స్థాయిలో పట్టు సాధించే లేకపోతున్నాడు. తెలుగు లో కూడా అతనికి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక రాబోయే సినిమాలతో మాత్రం ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో బాల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మాస్ కమర్షియల్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. దాదాపు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ అయితే సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం సూర్య శివ కలయికలో రాబోయే సినిమా పిరియాడ్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు ఆ ప్రాజెక్ట్ ను రెండు భాగాలుగా చూపించే అవకాశం ఉందట. కుదిరితే పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఆ సినిమాలో విజయ్ రెండు విభిన్నమైన పాత్రలతో అలరించబోతున్నాడట. ముఖ్యంగా ఒక పాత్ర కోసం సూర్య ఇప్పటికే వర్క్ షాప్ లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. తప్పకుండా సినిమా అతని కెరీర్లో బెస్ట్ ఫిలిం గా నిలుస్తుంది అని కూడా అంటున్నారు. ఇక దర్శకుడు శివ అజిత్ తో వరుసగా కమర్షియల్ సినిమాలతో మెప్పించిన విషయం తెలిసిందే. చివరగా రజనీకాంత్ ఆ దర్శకుడు పెద్దన్న అనే సినిమా తీశాడు కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది.

అలాగే సూర్య తెలుగు లో కూడా ఒక టాలెంటెడ్ దర్శకుడు తో సినిమా చేసేందుకు గత ఏడాది నుంచి చర్చలు జరుపుతున్నాడు. ఇక బాల సినిమా తర్వాత శివ దర్శకత్వంలో ఒక సినిమా చేసి తెలుగు దర్శకుడితో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా సూర్య కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. ఆ సినిమా జూన్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. మరి ఆ పాత్ర తో సూర్య ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.