సూర్య జ్యోతిక పిల్లలను చూశారా.. క్యూట్ పిక్ వైరల్

Tue Feb 07 2023 12:00:02 GMT+0530 (India Standard Time)

Surya and Jyothika's children.. Cute pic viral

జ్యోతిక... ఈ పేరు వినగానే మనకు చంద్రముఖి సినిమాలోని ఆమె రూపమే గుర్తొస్తుంది. నర్తకిగా డ్రెస్ వేస్కొని బిత్తిరి చూపులు చూస్తే ఆగం ఆభినయం అద్భుతంగా తోస్తుంది. ఈ పేరు తెలియని వాళ్లు ఆమె గురించి తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే డోలీ సజా కే రఖ్నా సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమె... తెలుగు తమిళ్ కన్నడ మలయాళం సినిమాలతో పాటు హిందీలోనూ నటించి మెప్పించింది. ఈమె అందం అభినయానికి సెపరేట్ ప్యాన్స్ బేస్ ఉన్నారు. కానీ హీరో సూర్యతో పెళ్లి.. పిల్లలు తర్వాత ఆమె తెరమరుగయ్యారు.పిల్లలు ఇంటి బాధ్యతలతో ఆమె చాలా సంతోషమైన జీవితాన్ని గడిపారు. గత రెండు మూడేళ్ల నుంచే జ్యోతిక మళ్లీ సినిమాల్లో కనిపిస్తోంది. కానీ నాటి నుంచి నేటి వరకు ఈమె సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడూ దగ్గర్లోనే ఉంటుంది.

తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో జ్యోతికతో పాటు ఓ పప్పీ... తన ఇద్దరు పిల్లలు కూర్చొని ఉన్నారు.

ఈ ఫొటోలు వీరంతా చాలా క్యూట్ అండ్ స్వీట్ గా కనిపిస్తున్నారు. యాష్ కలర్ లాంగ్ టాప్ లో జ్యోతిక. చేతిలో పప్పీతో మెరిసిపోతోంది. ఆమె కుడిచేతి వైపు ఆమె కొడుకు దేవ్ గ్రే టీషర్ట్ అండ్ బ్లాక్ కలర్ పాంట్ లో కనిపించగా.. ఆమె కూతురు దియా బ్లాక్ కలర్ టీషర్ట్ అండ్ యాష్ కలర్ ప్యాంటులో కనిపిస్తోంది.

ఈ ఫొటో చూసేందుకు చాలా ముద్దుగా కనిపిస్తోంది. అయితే మొదటి నుంచి జ్యోతికకు కుటుంబం భర్త పిల్లలు అంటే చాలా ప్రేమ. ఆ ప్రేమతోనే తనకు ఎంతో ఇష్టమైన నటనను కూడా కొన్నేళ్ల పాటు పక్కన పెట్టేసింది.

జ్యోతిక కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలకు పని చేసింది. తన భర్త సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా జై భీమ్ సినిమాలను ఆమే ప్రొడ్యూస్ చేసింది. అయితే జ్యోతిక తన కెరియర్ లో తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఫేర్ ఆవార్డు దినకరన్ అవార్డుతో పాటు మరెన్నో అవార్డును సొంతం చేసుకుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.