సౌత్ స్టార్స్ కు ఆదర్శంగా మారబోతున్న సూర్య

Tue Jul 14 2020 14:40:51 GMT+0530 (IST)

The Suriya is about to become the ideal for the South Stars

ప్రయోగాలు చేసే విషయంలో బాలీవుడ్ స్టార్స్ తో పోల్చితే సౌత్ స్టార్ హీరోలు చాలా వెనుకబడి ఉంటారు. సౌత్ హీరోలు ముఖ్యంగా తెలుగు హీరోలు ఇమేజ్ అనే చట్రంలో చిక్కుకుని ఉన్నారు. వారు ఆ చట్రం నుండి బయటకు వచ్చి సినిమాలు చేస్తే ప్రేక్షకులు చూస్తారా అనే భయంను కలిగి ఉన్నారు. ఒకసారి చూద్దాం ప్రేక్షకులు చూసేది లేనిది తెలుస్తుంది అంటూ ఏ ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. బాలీవుడ్ హీరోలు పలువురు ఓటీటీ బాట పడుతున్నారు. తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు ముందుకు రావడంతో పాటు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించేందుకు సిద్దం అయ్యారు.సౌత్ లో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో మూవీ కూడా ఓటీటీ విడుదలకు సిద్దంగా లేదు. సౌత్ హీరోలు ఓటీటీ విడుదలను అవమానంగా భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇదే సమయంలో తెలుగు.. తమిళ హీరోలు వెబ్ సిరీస్ ల్లో నటించడం అంటే తమ స్థాయిని తగ్గించుకోవడం అన్నట్లుగా అభిప్రాయంలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ హీరోలు పలువురు వెబ్ సిరీస్ లు చేస్తుంటే ఇప్పటి వరకు ఎవరు కూడా సౌత్ హీరోలు వెబ్ సిరీస్ లకు ముందుకు రాలేదు. మొట్టమొదటి సారి సూర్య వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మణిరత్నం నిర్మాణంలో ‘నవరస’ అనే విభిన్నమైన వెబ్ సిరీస్ రూపొందబోతుంది. ఈ సినిమాకు పలువురు దర్శకులుగా వ్యవహరించబోతున్నారు. ఆ వెబ్ సిరీస్ లో కీలక పాత్రను సూర్య పోషించేందుకు ఓకే చెప్పాడట. నవసర కాన్సెప్ట్ నచ్చడంతో ఓటీటీ ఎంట్రీకి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సౌత్ లో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన మొదటి స్టార్ హీరోగా సూర్య చరిత్రలో నిలిచి పోబోతున్నాడు. సూర్య ఓటీటీ ఎంట్రీ ఎంతో మందికి ఆదర్శంగా నిలువబోతుంది అంటున్నారు. నవసర సక్సెస్ అయ్యి సూర్య గురించి జనాలు మాట్లాడుకుంటే ఖచ్చితంగా పలువురు స్టార్స్ కూడా ఓటీటీ పై నటించేందుకు సిద్దం అయ్యే అవకాశం ఉంది.