Begin typing your search above and press return to search.

వరుస ఫ్లాప్స్‌ వచ్చినా తగ్గని క్రేజ్‌

By:  Tupaki Desk   |   23 Feb 2020 8:30 AM GMT
వరుస ఫ్లాప్స్‌ వచ్చినా తగ్గని క్రేజ్‌
X
తమిళ స్టార్‌ హీరో సూర్య ఈమద్య కాలంలో వరుస ఫ్లాప్స్‌ తో సతమతం అవుతున్నాడు. తమిళం మరియు తెలుగులో ఈయన సినిమాలు గతంలో మంచి సక్సెస్‌ లను దక్కించుకున్నాయి. కాని గత కొంత కాలంగా మాత్రం నిరాశ పర్చుతూ వచ్చాడు. తెలుగు మరియు తమిళంలో మాత్రం ఈయన మార్కెట్‌ తగ్గలేదు. ప్రస్తుతం ఈయన చేస్తున్న చిత్రం‘ఆకాశమే నీ హద్దురా’. తెలుగమ్మాయి సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది.

డెక్కన్‌ ఎయిర్‌ వేస్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రంను రూపొందిస్తున్నారు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేసి ఆసక్తికర కథనంతో సుధ కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో సన్‌ నెట్‌ వర్క్‌ సంస్థ శాటిలైట్‌ మరియు ఓటీటీ రైట్స్‌ ను భారీ మొత్తానికి దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

అన్ని భాషల శాటిలైట్‌ రైట్స్‌ మరియు ఓటీటీ రైట్స్‌ తో సగం బడ్జెట్‌ రికవరీ అయినట్లుగా తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు. త్వరలోనే సినిమా ట్రైలర్‌ ను విడుదల చేయబోతున్నారట. ఏప్రిల్‌ 9న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి బజ్‌ ఉన్న కారణంగా తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌ కు మంచి డిమాండ్‌ ఉంది.