దీపికా పదుకొణే మొగుడికి స్ఫూర్తి ఆయనే నట!

Sun Dec 04 2022 15:00:01 GMT+0530 (India Standard Time)

Ranveer Singhs inspiration shahrukh khan

బాలీవుడ్ స్టార్ హీరోల్లో రణవీర్ సింగ్ ఒకరు. వైవిధ్యమైన చిత్రాలతో పాటు...నెగిటివ్ షేడ్ రోల్స్ లోనూ తనదైన శైలిలో మెప్పించడం రణవీర్ ప్రత్యేకత. ఎంత మంది హీరోలున్నా?  కొన్ని జానర్ పాత్రల్లో అతనికంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది. నటుడిగా డే బై డే మరింత షైన్ అవుతూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మరి ఈ హీరోకి నటనలో స్ఫూర్తి ఎవరు? నటించాలి అన్న ఆసక్తిని రగిలిచింది? ఎవరు? అంటే  మరో మాట లేకుండా బాద్ షా షారుక్ ఖాన్ పేరు సూచించారు.రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించని `సర్కస్` ట్రైలర్ వేడుకలో భాగంగా  ఈ వ్యాఖ్యలు చేసారు. నాకే కాదు . చాలా మందికి షారుక్ ఖాన్ ఆదర్శం. మేమందరం అయన్ని చూసి నటులయ్యాం. అతనిలో కమిట్మెంట్..డెడికేషన్ అంటే ఎంతో ఇష్టం. సినిమాలంటే ఎంత ఫ్యాషన్ లేకపోతే అన్ని రకాల సినిమాలు చేయగలరు. నటుడిగా అతని స్థాయి గురించి మాట్లాడలేను.

ఆయన సాధించిన దానిలో కొంచెం సాధించినా నాకు చాలా గొప్ప. అలాంటి వారిని  స్పూర్తిగా  తీసుకుంటే? మరిన్ని సినిమాలు చేయగలం.  ఆయనలో కష్టపడే తత్వం నాకు బాగా నచ్చుతుంద`న్నారు.  మొత్తానికి రణవీర్  బాలీవుడ్ లో బాగా ఇష్టపడే హీరో షారుక్ ఖాన్ అని  ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా షారుక్ సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

సినిమా ప్రయత్నాల్లో ఉన్నప్పుడు నీహైట్ కి..హెయిర్ స్టైల్  కి  సినిమా హీరో? అవుతావా? అని ఎగతాళి చేసిన వారెంతో మంది ఉన్నారు. కట్చేస్తే  అదే హెయిర్ స్టైల్ మార్కెట్ లో కొన్నేళ్లకి ఓ  బ్రాండ్ గా మారిపోయింది. షారుక్ ఎదిగిన వైనంతోనే ఇదంతా సాధ్యమైంది. అందుకే రణవీర్ షారుక్ ని  అంతగా అభిమానిస్తున్నారు. ఇక  రణవీర్ ప్రేమించిన దీపికా పదుకొణేని పెళ్లాడిన తర్వాత నటుడిగా కథల ఎంపికలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథల ఎంపికలో దీపిక సైతం విలువైన సలహాలు ఇస్తోంది. ఆరకంగా భార్యా భర్తలిద్దరు బాలీవుడ్ లో మరింత స్ర్టాంగ్ అవుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.