రోజుకు ఒకటి వదులుతూనే ఉన్న వర్మ

Thu Mar 14 2019 16:43:38 GMT+0530 (IST)

RGV Shared Chandrababu And Balayya Assembly Visuals On Twitter

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రంపై తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి ఆసక్తి కనబర్చుతున్నారు. ఇప్పటికే వర్మ తన సినిమాకు తనదైన శైలిలో ప్రమోషన్స్ చేసి అంచనాలను పీక్స్ లోకి తీసుకు వెళ్లాడు. జనాలు అంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా కూడా వర్మ ఏమాత్రం వదలకుండా ప్రతి రోజు ఏదో ఒక వీడియో లేదా పోస్టర్ ను కాని విడుదల చేస్తూ సినిమాను పబ్లిక్ లో మరింతగా చర్చించుకునేలా చేస్తున్నాడు.తాజాగా వర్మ ఒక వీడియోను విడుదల చేశాడు. అందులో బాలకృష్ణ మరియు చంద్రబాబు నాయుడులు అసెంబ్లీలో మాట్లాడుతున్న విజువల్స్ ను ఉపయోగించాడు. ఆ విజువల్స్ కు మిమిక్రీ చేయించి బాలయ్యతో తన సినిమాకు పాజిటివ్ గా మాట్లాడించి చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లుగా చూపించి ఫన్ క్రియేట్ చేశాడు. మొత్తానికి వర్మ అన్ని రకాలుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ప్రమోట్ చేస్తున్నాడు.

ఈ చిత్రం గురించి ఎవరైనా ఆసక్తికర మీమ్స్ పంపిస్తే వెంటనే వాటిని తన వాల్ పై పోస్ట్ చేస్తున్న వర్మ ఈసారి చంద్రబాబును నేరుగా ట్యాగ్ చేసి ట్విట్టర్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు నా పిల్లలు కలిసి నన్ను చంపారు అంటూ ఎన్టీఆర్ చెప్పినట్లుగా పోస్ట్ చేశాడు. ఎన్నికల వేల వర్మ చేస్తున్న హడావుడి టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ఎన్నికలు ముగిసే వరకు వాయిదా వేయాలని ఆదేశించాలని ఈసీని టీడీపీ నాయకులు కోరారు. ఆ విషయంలో ఇంకా ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


For Video Click Here