Begin typing your search above and press return to search.

క్లాసిక్ అవ‌తార్ తో రాధిక మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తుందా?

By:  Tupaki Desk   |   5 Dec 2022 6:30 AM GMT
క్లాసిక్ అవ‌తార్ తో రాధిక మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తుందా?
X
సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించిన 'డీజే టిల్లు' మూవీతో ఒక్క‌సారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చిన హీరోయిన్ నేహా శెట్టి. ఈ మూవీలో రాధిక పాత్ర‌లో త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని మంచి మార్కులు కొట్టేసింది. టిల్లుని న‌మ్మించి మోసం చేస్తూ అత‌న్ని ముప్పుతిప్ప‌లు పెట్టే రాధికగా నేహా శెట్టి మంచి పేరు తెచ్చుకుంది. త‌న పుట్టిన రోజు నేడు. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో పూరి ఆకాష్ హీరోగా న‌టించిన 'మొహ‌బూబా' మూవీతో టాలీవుడ్ లోకి ప్ర‌వేశించింది.

తొలి ప్ర‌య‌త్నం ఫ్లాప్ కావ‌డంతో తెలుగులో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డం మొద‌లు పెట్టింది. సందీప్ కిష‌న్ తో చేసిన 'గ‌ల్లీ రౌడీ' కూడా త‌న‌కు హిట్టివ్వ‌క‌పోవ‌డంతో 'డీజే టిల్లు'ని న‌మ్ముకుంది. సిద్దూ జొన్న‌ల‌గడ్డ‌తో లిప్ లాక్ ల‌కు కూడా రెడీ అయిపోయి నెగెటివ్ పాత్ర అయినా స‌రే హిట్టు కోసం వెన‌కాడ‌కుండా ఓకే చేసి 'డీజే టిల్లు'తో తొలి హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. రాధిక పాత్ర‌లో న‌టించి మంచి గుర్తింపుతో పాటు సూప‌ర్ హిట్ ని ద‌క్కించుకుంది.

ప్ర‌స్తుతం 'Rx100' హీరో కార్తికేయ గుమ్మ‌కొండతో క‌లిసి న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'బెదురులంక 2012'లో న‌టిస్తోంది. ల‌క్కీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై ర‌వీంద్ర బెన‌ర్జీ నిర్మిస్తున్న ఈ మూవీని క్లాక్స్ తెర‌కెక్కిస్తున్నాడు. గ‌మ్మ‌త్తైన కాన్సెప్ట్ తో యుగాంతం నేప‌థ్యంలో సాగు ఓ టిపిక‌ల్ స్టోరీగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.

రీసెంట్ గా హీరో కార్తికేయ ఫ‌స్ట్ లుక్ ని రివీల్ చేస్తూ కాన్సెప్ట్ నేప‌థ్యంలో మోష‌న్ పోస్ట‌ర్ ని మేక‌ర్స్ విడుద‌ల చేశారు. స‌రికొత్త నేప‌థ్యంలో సాగే ఈ మోష‌న్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకుని సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.

తాజాగా సోమ‌వారం హీరోయిన్ నేహాశెట్టి పుట్టిన రోజు సంద‌ర్భంగా మేక‌ర్స్ త‌న ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు. ఈ సినిమాలో సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో క్లాసిక్ అవ‌తార్ లో క‌నిపిస్తున్న ఆధునిక అమ్మాయిగా నేహాశెట్టి పాత్ర వుంటుంద‌ని ఫ‌స్ట్ లుక్ ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. కార్తికేయ ఫ‌స్ట్ లుక్ లో అల్ట్రా మోడ్ర‌న్ యువ‌కుడిగా క‌నిపిస్తే నేహాశెట్టి మాత్రం క్లాసిక్ అవ‌తార్ లో క‌నిపిస్తూ షాకిస్తోంది. ఈ ఇద్ద‌రు ఖ‌చ్చితంగా ఈ మూవీతో మ్యాజిక్ చేయ‌డం ఖాయం అని మేక‌ర్స్ చెబుతున్నారు.

కామెడీ, హ్యుమ‌న్ ఎమోష‌న్స్ నేప‌థ్యంలో సాగే ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. స్వ‌ర బ్రహ్మ మ‌ణిశ‌ర్మ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. కంటెంట్ ప్ర‌ధానంగా సాగే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ మూవీని ద‌ర్శ‌కుడు క్లాక్స్ తెర‌కెక్కిస్తున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.