దీపికాతో కష్టమని దిశా కి ఓటు వేశారు

Fri May 26 2023 11:17:16 GMT+0530 (India Standard Time)

Disha Patani In Simbu PanIndian Movie

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పారితోషికం విషయంలో నిర్మాతలకు షాక్ ఇస్తూనే ఉంది. ఇటీవల తమిళ హీరో శింబు హీరోగా యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమాను రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునేను నటింపజేయాలని భావించారు.తమిళ ఫిల్మ్ మేకర్స్ సదరు సినిమా కోసం దీపికా ను సంప్రదించిన సమయంలో పారితోషికంతో భయపెట్టిందనే వార్తలు ఆ మధ్య వచ్చింది. దీపికా పారితోషికం మరియు ఇతర అన్ని ఖర్చులు కలిపి దాదాపుగా రూ.35 కోట్లను డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.

దాంతో తమ బడ్జెట్ కు ఆమె పారితోషికం సెట్ అవ్వదనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఆమెను నటింపజేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారట.

దీపికా స్థానంలో బాలీవుడ్ కే చెందిన ముద్దుగుమ్మ దిశా పటానీని ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది. వచ్చే నెల నుంచి శింబు తో కలిసి ఆమె ఆ పాన్ ఇండియన్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా నటించబోతుంది అనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి స్పష్టత లేదు.

ఇప్పటికే దిశా పటానీ తమిళంలో సూర్య హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కంగువా' లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ పీరియాడిక్ మూవీలో దిశా పటానీ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇక శింబు సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాళ్ చిత్రం ఫేమ్ దేసింగు పేరియసామి దర్శకత్వంలో కమల్ హాసన్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా యొక్క షూటింగ్ ను జూన్ రెండవ లేదా మూడవ వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.