బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 సాలిడ్ అప్‌డేట్.. మళ్లీ రచ్చ రచ్చ

Sat Oct 01 2022 11:35:27 GMT+0530 (India Standard Time)

Balayya Unstoppable Season 2 Solid Update ..

నందమూరి బాలకృష్ణ ను సరికొత్తగా ప్రేక్షకులకు చూపించిన టాక్ షో అన్ స్టాపబుల్. ఎన్నో టాక్ షోల్లో హోస్ట్ ముందు కూర్చుని మాట్లాడిన బాలకృష్ణ మొదటి సారి తానే హోస్ట్ గా మారడంతో అంతా కూడా ఎలా చేస్తాడో... ఎలా మాట్లాడుతాడో అనే అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ తన యొక్క ప్రతిభతో అన్ స్టాపబుల్ సీజన్ 1 ని సూపర్ హిట్ చేశాడు.అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న అన్ స్టాపబుల్ కి సీజన్ 2 ను తీసుకు రావాల్సిందే అంటూ అభిమానులు డిమాండ్ చేశారు.. ఆహా వారు అడిగారు.. బాలయ్య ఓకే చెప్పాడు. గత కొన్ని నెలలుగా అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు స్ట్రీమింగ్ తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు.

ఇప్పటికే సీజన్ 2 కోసం ఒక థీమ్ సాంగ్ ను చిత్రీకరించారు. అంతే కాకుండా ఈనెల 4వ తారీకున మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ను విడుదల చేయబోతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నేడు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు అన్ స్టాపబుల్ షో లో పాల్గొనబోతున్నారు.

బాలయ్య తో వారి యొక్క మాట ముచ్చట్లు నేడు చిత్రీకరించి.. దాంట్లోంచే నాల్గవ తారీకున సీజన్ 2 కు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమోగా విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 4న ట్రైలర్ అంటూ విడుదల చేసిన పోస్టర్ లో బాలయ్య ను బ్యాక్ నుండి చూపించారు. లుక్ మరో లెవల్ లో ఉండబోతుందని ఈ పోస్టర్ ని చూస్తుంటే అనిపిస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మొదటి సీజన్ ను మించి రెండవ సీజన్ ఉండేలా ఆహా టీమ్ ప్లాన్ చేశారట. మొదటి ఎపిసోడ్ కు బాలయ్య తో చంద్రబాబు మరియు లోకేష్ లు సందడి చేయబోతున్నారు. ఆ తర్వాత హీరోయిన్స్ ఇద్దరు ముగ్గురు కూడా ఈ షోలో పాల్గొనబోతున్నారట.

ముఖ్యంగా అనుష్క మరియు సమంతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి కూడా చివరి ఎపిసోడ్ గెస్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి ఈసారి కూడా రచ్చ రచ్చే అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.