Begin typing your search above and press return to search.

బాబాయ్ షో లో అబ్బాయి అసలు విషయం ఏంటంటే

By:  Tupaki Desk   |   4 Oct 2022 10:43 AM GMT
బాబాయ్ షో లో అబ్బాయి అసలు విషయం ఏంటంటే
X
నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడు అనే విషయమై నేడు అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే మొదటి ఎపిసోడ్ లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న విషయం తెలిసిందే. నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఆ విషయం పక్కన పెడితే గత రెండు మూడు రోజులుగా ఈ టాక్ షోలో ఎన్టీఆర్ పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బాబాయి అబ్బాయి మధ్య గత కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ పుకార్లకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ బాబాయ్ టాక్ షో లో పాల్గొనాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం మొదలు అయ్యింది. ఆ విషయమై క్లారిటీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏమాత్రం నిజం కాదని.. పుకార్లు మాత్రమే ప్రచారం జరుగుతున్నాయి అంటూ కొందరు బలంగా వాదిస్తూ వస్తున్నారు.ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం, నందమూరి బాలకృష్ణ టాక్ షో లో పాల్గొనడం లేదు, ఇప్పటి వరకు ఎన్టీఆర్ ని ఎవరు సంప్రదించలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తప్పకుండా బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ కాంబో ఉంటుందని ఆశపడ్డ అభిమానులకు నిరాశే ఎదురవుతోంది.

ఇప్పటికే వీరిద్దరి వీరిద్దరి మధ్య సఖ్యత లేదంటూ ప్రచారం జరుగుతుండగా తాజాగా ఎన్టీఆర్ పాల్గొనడం లేదని క్లారిటీ రావడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.

టాక్ షో కి బాలయ్య ముందుకు ఎన్టీఆర్ వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.