Begin typing your search above and press return to search.

RRR సెట్స్ లో ఆలియా.. టైటిల్ రోలింగ్ లో స‌ర్ ప్రైజ్ స్టార్లు!

By:  Tupaki Desk   |   21 July 2021 10:37 AM GMT
RRR సెట్స్ లో ఆలియా.. టైటిల్ రోలింగ్ లో స‌ర్ ప్రైజ్ స్టార్లు!
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్-యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్‌.ఆర్`. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చిత్రీక‌ర‌ణ శ‌ర వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా యూనిట్ పాట‌ల షూటింగ్ లో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఓ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్స్ లో షూట్ చేస్తున్నారు. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు ఆధ్వ‌ర్యంలో ఈ భారీ సెట్ లో చిత్రీక‌రణ‌ జ‌రుపుతున్నారు.

ఇప్ప‌టికే ఎన్టీఆర్- రామ్ చ‌ర‌ణ్ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ షూట్ లో జాయిన్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో సాంగ్ షూట్ కోసం బాలీవుడ్ హీరోయిన్ అలియాభ‌ట్ కూడా మంగ‌ళ‌వారం సాయ‌త్రం ముంబై నుంచి హైద‌రాబాద్ లో ల్యాండ్ అయింది. వ‌స్తూనే అమ్మ‌డు `రైజ్ & షైన్` అంటూ ట్వీట్ చేసి ఆర్ ఆర్ ఆర్ టీమ్ లో జోష్ నింపింది. నేటి ఉద‌యం 6.30 గంట‌ల‌కు అమ్మ‌డు సెట్స్ లో త‌ళుక్కున మేక‌ప్ వేసుకుంటూ మెరిసింది. అటుపై యువ‌రాణి గెట‌ప్ లో ఆద్యంతం ఆక‌ట్టుకుంది.

ఈ చిత్రానికి ఎం.ఎం కీర‌ణ‌వాణీ సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ ని మ్యూజిక‌ల్ గా ఇంకా హైస్టాంర్డ్ లో నిల‌బెట్టేందుకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అమిత్ త్రివేది స‌హ‌కారం కూడా కీర‌వాణీ తీసుకుంటున్నట్లు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అమిత్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ప్ర‌త్యేకంగా దించిన‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారం సాగుతోంది.

టైటిల్ రోలింగ్ లో ప్ర‌భాస్ -ర‌వితేజ‌..!

RRR ప్రచార గీతంలో ప్రేక్ష‌కులు ఊహించ‌ని మెరుపుల్ని జ‌క్క‌న్న టీమ్ యాడ‌ప్ చేయ‌నుంద‌ని స‌మాచారం. సినిమా చివర్లో రోలింగ్ టైటిల్స్ లో ప‌లువురు టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కులు క‌నిపించ‌నున్నార‌న్న‌ది ఇప్పుడు సెన్సేష‌న‌ల్ గా మారింది. అత్యంత కాస్ట్ లీగా తెర‌కెక్కిస్తున్న ఈ పాట‌లో బాహుబ‌లి స్టార్ ప్రభాస్- విక్ర‌మార్కుడు స్టార్ రవితేజను కూడా
రాజ‌మౌళి
చూపించాల‌ని ప్లాన్ చేశార‌ట‌. యువ‌హీరోలు నితిన్- నాని.. మ‌ర్యాద రామ‌న్న‌ సునీల్ ని కూడా చూపించ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఈ ప్ర‌త్యేక పాట‌లో ప్ర‌భాస్- ఎన్టీఆర్ -రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్ లో క‌నిపించే వీలుంద‌ని కూడా తెలుస్తోంది. ఇక ఇదే పాట‌లో సినిమాకి ప‌ని చేసిన కీల‌క టెక్నీషియ‌న్ల‌తో పాటు నిర్మాత‌ల‌ను.. లైట్ బోయ్ .. సెట్ వ‌ర్క‌ర్ల‌ను కూడా చూపించే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. అందుకు త‌గ్గ‌ట్టే భారీ సెట్ ని నిర్మించి అందులో పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇక టాలీవుడ్ హిస్ట‌రీలో ఇది ఒక అద్భుతమైన ఆవిష్క‌ర‌ణ అవుతుంద‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. ఇక సినిమా అంతా ఒకెత్తు అనుకుంటే ఈ పాట కోసం జ‌క్క‌న్న ఇంత ఎఫ‌ర్ట్ పెడుతుండ‌డంతో అభిమానుల్లో మ‌రింత క్యూరియాసిటీ పెరుగుతోంది. అక్టోబ‌ర్ లో ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిన‌దే.