Begin typing your search above and press return to search.

RRR కోసం `సైరా- శాత‌క‌ర్ణి` స్పెష‌లిస్టునే దించారు!

By:  Tupaki Desk   |   20 July 2021 3:30 PM GMT
RRR కోసం `సైరా- శాత‌క‌ర్ణి` స్పెష‌లిస్టునే దించారు!
X
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ RRR వ‌ర‌ల్డ్ వైడ్ ఆడియెన్ ని దృష్టిలో పెట్టుకుని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. అలాంటి గ్రేట్ మూవీకి సంగీతం ప‌రంగా హైస్టాండార్డ్స్ అవ‌స‌రం. మ‌ర‌క‌త‌మ‌ణి ఎం.ఎం.కీర‌వాణి ఈ సినిమా సంగీతాన్ని లీడ్ తీసుకుని ఇండ‌స్ట్రీ టాప్ టెక్నీషియ‌న్ల‌తో క‌లిసి ప‌ని చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బాహుబ‌లి త‌ర‌హాలోనే ఆర్.ఆర్.ఆర్ రీరికార్డింగ్ స‌హా పాట‌లు మ‌రో లెవ‌ల్ లో ఎలివేట్ చేసేందుకు జ‌క్క‌న్న - కీర‌వాణి బృందాలు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.

`ఆర్.ఆర్.ఆర్` మ్యూజిక‌ల్ గా ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. కీర‌వాణి మాస్ట‌ర్ మైండ్ ట్యూన్స్ తో `ఆర్.ఆర్.ఆర్` మ్యూజిక‌ల్ గా హిట్ అవ్వ‌డం ఖాయ‌మ‌నే టాక్ ముందు నుంచే ఉండ‌నే ఉంది. రిలీజ్ త‌ర్వాత `బాహుబ‌లి` సినిమా పాన్ ఇండియా స్థాయికి.. అంత‌ర్జాతీయ స్థాయికి చేరుకుందంటే నిపుణుల బృందంతో కూడిన‌ కీర‌వాణి అసాధార‌ణ వ‌ర్క్ కూడా ఒక కార‌ణం.

బాహుబ‌లికి నేప‌థ్య సంగీతం మ‌రో మెట్టు పైన నిల‌బెట్టింది. ఇప్పుడు పాన్ ఇండియా ఆర్.ఆర్.ఆర్ కోసం కీర‌వాణి రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేస్తున్నారు. ఈ మూవీని మ్యూజిక‌ల్ గాను హైలైట్ గా నిల‌బెట్టాల‌ని కీర‌వాణి రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నారు. అయితే ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం కోసం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అమిత్ త్రివేది కూడా భాగ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న తో వ‌ర్క్ చేయ‌డం ఎంతో బాగుందంటూ కీర‌వాణి తాజాగా ట్వీట్ చేసారు.

సాధార‌ణంగా కీర‌వాణి చిత్రాల‌కు ఆయ‌నే వ‌న్ మేన్ ఆర్మీలా ప‌నిచేస్తారు. కానీ ఆర్.ఆర్.ఆర్ కోసం బాలీవుడ్ దిగ్గ‌జం.. జాతీయ అవార్డ్ గ్ర‌హీత‌ అమిత్ త్రివేదిని బ‌రిలో దించేసారంటే? క్వాలిటీ వ‌ర్క్ కోసం ఏ స్థాయిలో ఎఫెర్ట్స్ పెడుతున్నార‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది. అమిత్ త్రివేది గతంలో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి`- న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `గౌత‌మిపుత్ర‌శాత‌క‌ర్ణి` సినిమాలకు సంగీతం తో పాటు ఆర్.ఆర్ ని అందించిన సంగ‌తి తెలిసిందే. మ్యూజిక‌ల్ గా.. ఆర్.ఆర్ ప‌రంగా ఆ రెండు సినిమాలు హాలీవుడ్ స్టాండార్డ్స్ తో ఆక‌ట్టుకున్నాయి. అందుకే ఇప్పుడు అమిత్ సేవ‌ల్ని కీర‌వాణి వినియోగించుకుంటున్నారు.

ఆర్.ఆర్.ఆర్ సాంగ్ కోసం అమిత్ నాతో భాగ‌స్వామి అయ్యారు. త‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌డం చాలా ఆహ్లాద‌క‌రంగా ఉంద‌ని ఎం.ఎం.కీర‌వాణి తెలిపారు. ఈ సంద‌ర్భంగా వ‌ర్కింగ్ స్పాట్ నుంచి అమిత్ తో క‌లిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు.

అమిత్ త్రివేది టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌కు ప‌ని చేస్తున్నారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న 20 వ సినిమా రాధేశ్యామ్ కి ఆయ‌న‌ సంగీతం అందిస్తున్నారు. అమిత్ తో పాటు మ‌రో ఇద్ద‌రు సంగీత దర్శ‌కులు ఈ చిత్రానికి ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. అలాగే అమిత్ త్రివేది 2009లో జాతీయ అవార్డును అందుకున్నారు. కెరీర్ లో ఐదు ఫిలింఫేర్ అవార్డుల 6 జీ సినీ అవార్డుల‌ను అందుకున్నారు. 1979లో ముంబైలో అత‌డు జ‌న్మించాడు.