Begin typing your search above and press return to search.

లోకేష్ పాదయాత్ర : జస్ట్ అలా సాగాల్సిందే...!

పాదయాత్ర అంటే పవిత్ర యాగం అంటారు. అది ఒక బృహత్తర సంకల్పం. అలాంటి పాదయాత్రకు లోకేష్ మూడు నెలల క్రితం బ్రేక్ ఇచ్చారు

By:  Tupaki Desk   |   27 Nov 2023 4:43 PM GMT
లోకేష్ పాదయాత్ర : జస్ట్ అలా సాగాల్సిందే...!
X

పాదయాత్ర అంటే పవిత్ర యాగం అంటారు. అది ఒక బృహత్తర సంకల్పం. అలాంటి పాదయాత్రకు లోకేష్ మూడు నెలల క్రితం బ్రేక్ ఇచ్చారు. ఆనాడు చంద్రబాబు అరెస్ట్ నేపధ్యంలో లోకేష్ కొన్ని రోజులు బిజీ అయ్యారు. అలా అనుకున్నా ఆ తరువాత అయినా లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభించాలి కదా.

మరి లోకేష్ పాదయాత్రకు కామా పెట్టేసి చాలా కాలం గడిపారు. ఇపుడు ఆయన తిరిగి పాదయాత్ర అంటున్నారు. దాని వెనక కారణం చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చింది అని కావచ్చు. కానీ నాయకుడు అన్న వాడు కష్ట కాలంలో కదా అండగా ఉండాలి. క్యాడర్ తల్లడిల్లినపుడు కదా వారిని దగ్గరకు తీయాలి.

చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ పూర్తిగా సంక్షోభంలో కూరుకుని పోతే లోకేష్ చేసిందేంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. అదే సమయంలో జనసేన తరఫున పవన్ ఫుల్ సపోర్ట్ ఇచ్చి పొత్తులు పెట్టుకుంటామని చెప్పడం అంటే అది సొంత పార్టీలో నాయకత్వం ఫెయిల్యూర్ కాదా అన్న విమర్శలూ చేసిన వారు ఉన్నారు.

అంతా బాగుంటేనే పాదయాత్ర చేస్తాను అని ఏమైనా ఒట్టు పెట్టుకుని లోకేష్ పాదయాత్ర మొదలెట్టారా అన్నది అర్థం కాదు కానీ ఆయన ఇపుడు చేస్తున్నది అలాగే ఉంది అని అంటున్నారు అసలు పాదయాత్ర ఎందుకు ఆపారు, తిరిగి ఎందుకు చేస్తున్నారు అన్నది క్లారిటీ అయితే లేదు. అది తమ్ముళ్లకు కూడా చెప్పలేరు కూడా అంటున్నారు.

మరో విషయం కూడా ఇక్కడ ఉంది. నాలుగు వేల కిలోమీటర్లు కుప్పం టూ ఇచ్చాపురం అని ఆర్భాటంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం కాదు కాలు కదిపాక కదా అసలు విషయం తెలిసింది అన్న విమర్శలూ ఉన్నాయి. పాదయాత్రకు ఆదిలో అయినా మైలేజ్ దక్కిందా అంటే పెద్దగా లేదు అనే అంటారు.

ఇక పాదయాత్ర సో సోగా అలా సాగుతోంది అనే పరిస్థితే ఎపుడూ ఉంది. నిజంగా లోకేష్ పాదయాత్ర ఏపీలో ఆకాశాన్ని భూమిని కలిపేస్తే చంద్రబాబు ఎందుకు అప్పట్లో కాళ్ళకు బలపం కట్టుకుని తిరుగుతారు అని కూడా అన్న మాట ఉంది. ఎలా చూసుకున్నా హైప్ ఎంత క్రియేట్ చేసినా స్వపక్షం ఎంత జాకీలు వేసి లేపిన స్వజనుల మీడియా ఎంతగా రాతలు రాసి జాతకాలు మార్చాలని అనుకున్నా పాదయాత్రకు అయితే పెద్దగా పొలిటికల్ మైలేజ్ రాలేదు, లోకేష్ ని ఒక లీడర్ గానూ ప్రొజెక్ట్ చేయలేదు అన్న కఠిన విశ్లేషణ ఉంది.

ఈలోగా బాబు అరెస్ట్ తో పాదయాత్రకు ఫుల్ స్టాప్ పడిపోయింది అని అంతా అనుకున్నారు. ఇక ఏమి నడుస్తారులే అన్న వారూ ఉన్నారు. లోకేష్ పాదయాత్ర ఉందా అని అనుకున్న వారు లేదూ అనుకున్నా పెద్ద తేడా ఏమీ లేకుండా పోయిన వేళ కాళ్లు అరగగొట్టుకుని లాభమేంటి అన్న మాటా వచ్చింది. అయితే ప్రత్యర్ధుల విమర్శలకు జవాబు చెప్పడం కోసమా నడిస్తే ఎంతో కొంత ఏదోలా విశాఖలో ముగించేయవచ్చు అన్న ఆలోచనతోనా ఏదో ఒకటి అయింది అనుకుని లోకేష్ రాజోలు నుంచి మళ్లీ పాదయాత్ర మొదలెట్టారు అని అంటున్నారు

ఈ సందర్భంగా లోకేష్ ఇచ్చిన స్పీచ్ మాత్రం విమర్శలకు గురి అయ్యేలాగానే ఉంది. అధికార వైసీపీని చూపించి మీ అందరి సంగతి తేలుస్తామని లేస్తే మనిషిని కానంటూ లోకేష్ ఇచ్చిన ప్రకటనలే నవ్వులపాలు అయ్యాయని అంటున్నారు. తండ్రి అరెస్ట్ అయితే లోకేష్ ఏమి చేశారు అని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి గట్టిగానే ప్రశ్నించారు.

ఏకంగా యాభై మూడు రోజులు బాబు జైలులో ఉంటే పార్టీ పడకేసి ఉంటే లోకేష్ ఢిల్లీ వెళ్ళి ఏమి చేశారు అన్న వైసీపీ ప్రశ్నలకు జవాబు అయితే లేదు అనే అంటున్నారు. అంతా అయ్యాక ఇపుడు తాపీగా వచ్చి అంతు తేలుస్తామంటే అది హాస్యరసం పండించే కధా చిత్రం కాక మరేమిటి అవుతుంది అని అంబటి రాంబాబు లాంటి వారు అంటున్నారు అంటే అర్ధం చేసుకోవాలిగా.

ఇక భయం అంటే ఏమిటో వైసీపీ నేతలు చూపిస్తానని లోకేష్ ఇస్తున్న స్టేట్మెంట్స్ కూడా ఉత్తర కుమారుడి ప్రగల్భాలుగా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే భయపడే కదా లోకేష్ ఢిల్లీలో చాన్నాళ్ళు ఉండిపోయింది అని అంటున్నారు. అలాంటి నేత తమకు భయం గురించి చెప్పడమేంటి అని ఎద్దేవా చేస్తున్నారు.

ఇంతకీ ఏపీ పాలిటిక్స్ లో లోకేష్ పాదయాత్ర ఇంపాక్ట్ ఏమిటి ఎంత ఉంటుంది అంటే లైట్ తీస్కో అనే వస్తోందిట. జస్ట్ అలా సాగిపోతోంది అంతే అని అంటున్నారు. ఇలా నడచి ఎలాగోలా విశాఖలో ముగించే ఈ పాదయాత్ర టీడీపీని ఘన విజయం దిశగా నడిపిస్తుంది అనుకుంటే పవన్ తో పొత్తులు ఎందుకు ఇతర పార్టీలతో మైత్రి కోసం ఎత్తులు ఎందుకు అన్న నిలువెత్తు ప్రశ్న ఉండనే ఉంది అంటున్నారు. సో లోకేష్ పాదయాత్రను జనాలు సీరియస్ గా తీసుకోరనే ధీమా నిండుగా అధికార వైసీపీలో ఉంది. లోకేష్ పాదయాత్రకు వైసీపీకి అదే శ్రీరామ రక్ష అని అంటున్నారు.