Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్... షర్మిళ మౌనంపై రెండు భిన్నాభిప్రాయాలు!

అవును... ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఏపీలో రాజకీయం విపరీతంగా వేడెక్కుతున్న తరుణంంలో... అనూహ్యంగా వైఎస్ షర్మిళ మౌనంగా ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

By:  Tupaki Desk   |   27 March 2024 4:41 PM GMT
హాట్  టాపిక్... షర్మిళ మౌనంపై రెండు భిన్నాభిప్రాయాలు!
X

తెలంగాణలో రాజన్న రాజ్యం అంటూ హల్ చల్ చేసిన వైఎస్ షర్మిళ.. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో చేరారు! ఈ నేపథ్యంలో... ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకొన్నది మొదలు ఆమె వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు. 2014లో కూటమి చేసిన సంగతులను విస్మరించినట్లుగా స్పందించిన ఆమె... కేవలం జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

దీంతో... ఆమె చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని.. చంద్రబాబు కూడా గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టారని.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి అనధికారికంగా మద్దతు తెలిపారని.. విమర్శలు తెరపైకి వచ్చాయి. దీంతో... కాంగ్రెస్ కు చంద్రబాబుకు ఉన్న అవినాభావ సంబంధంతో ఏపీలో షర్మిళ వారిద్దరూ వదిలిన బాణం అనే కామెంట్లు బలంగా వినిపించాయి.

ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన వైఎస్ వివేకానంద రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా... వైఎస్ సునీత తన తండ్రి జ్ఞాపకర్థం కడపలో ప్రార్థనా సభను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వైఎస్ షర్మిళ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా... వివేకా హంతకులను రక్షిస్తున్నారంటూ... జగన్ పై సునీత, షర్మిళ విరుచుకుపడ్డారు. వైసీపీకి ఓటు వేయొద్దని అన్నారు.

అనంతరం... వైజాగ్ లో జరిగిన రేవంత్ రెడ్డి సభ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు!! అది జరిగి 10 రోజులు కావొస్తున్నా.. షర్మిళ శిభిరంలో అలజడి లేకుండా పోయింది! ఇదే సమయంలో కడప లోక్ సభ స్థానానికి షర్మిళ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే... వాటిపైనా అప్ డేట్స్ లేవు! దీంతో... ఎందుకు ఇలా జరిగింది అనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఏపీలో రాజకీయం విపరీతంగా వేడెక్కుతున్న తరుణంంలో... అనూహ్యంగా వైఎస్ షర్మిళ మౌనంగా ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అయితే... ఈమె వ్యక్తిగత కారణాలతో మౌనంగా ఉన్నారా.. లేక, ఆమెను చంద్రబాబు లేక, జగన్ లు మౌనంగా మార్చారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని అంటున్నారు.

ఆ సందేహాలు రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి... వైసీపీ కి ఉన్న ఓటు బ్యాంక్ లో అత్యధిక శాతం కాంగ్రెస్ ది అని.. ఈ సమయంలో షర్మిళ బలంగా రంగలోకి దిగితే అందులో కనీసం 4 - 5 శాతం ఓటు బ్యాంకును కాంగ్రెస్ తగ్గించగలిగితే.. అది వైసీపీకి అతిపెద్ద దెబ్బ అని జగన్ భావించారని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి తన చెల్లిని సైలంట్ చేయించారని చెబుతున్నారు!

ఇక రెండో కారణం... ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి ఏమాత్రం అవకాశం లేకుండా జనసేన, బీజేపీలను తమతో పాటు కట్టేసుకున్నాము కాబట్టి... ఈ పరిస్థితుల్లో షర్మిళ రంగంలోకి దిగి ప్రభుత్వ వ్యతిరేక ఓటులో కనీసం 2 శాతం లాక్కున్నా... కూటమి పరిస్థితి దయణీయంగా మారే ప్రమాదం ఉందని.. చంద్రబాబు తన పాతపరిచయాల్లో భాగంగా కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి షర్మిళను మ్యూట్ చేశారని అంటున్నారు!

ఇలా షర్మిళ మౌనంగా ఉండటంపై ఏపీ రాజకీయాల్లో రెండు రకాల అభిప్రాయాలు, ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి. మరి ఈ విషయంపై షర్మిళ ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి!