ఎన్నికల తర్వాత.. ఎన్నికలను మించి.. వైసీపీ డ్యామేజీ ..!
ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు ముందుకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.
By: Tupaki Desk | 10 Jun 2025 12:00 AM ISTప్రతిపక్షం నుంచి ప్రధాన ప్రతిపక్షానికి ఎదగాలని.. భావించిన వైసీపీకి ఇప్పుడు పూర్తిగా వాయిస్ కట్ అయి పోయింది. ఇప్పుడు ఎవరూ కూడా.. బయటకు వచ్చే అవకాశం లేదు. ఎవరూ నోరు విప్పే అవకాశం కూడా లేకుండా పోయింది. ఒకప్పుడు ఏం జరిగినా.. ఎదురుదాడి చేసిన మాజీ మంత్రులు.. రోజా, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ సహా అందరూ ఎక్కడివారు అక్కడ సైలెంట్ అయిపోయారు.
కనీసం మీడియా మిత్రులు చేస్తున్న ఫోన్లకు కూడా ఎవరూ స్పందించలేదు. ఎవరూ ముందుకు రావడ మూ లేదు. సాక్షిమీడియా చానెల్‌లో వచ్చిన వ్యాఖ్యల అనంతరం.. పార్టీ ధైర్యంగానే ఉంది. నాయకులు ఎదురుపోరాటం చేస్తారులే అనుకున్నారు. ఎదురు దాడి చేసిన ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తారని అనుకున్నారు. కానీ, చిత్రంగా.. ఈ వ్యవహారం సర్దుమణగకపోగా.. మరింతగా పెరుగుతోంది. రోజు రోజుకు పెద్దది కూడా అవుతోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు ముందుకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. నిజానికి ఇప్పటికే కనుక ఈ వ్యవహారం సర్దుమణిగి ఉంటే.. పైన చెప్పుకొన్న వారిలో ఒక్కరో ఇద్దరో అయినా.. ముందుకు వచ్చేవారు. కానీ, ఆ పరిస్థితిలేదు. ఒక రకంగా చెప్పాలంటే.. ఎన్నికల తర్వాత.. ఎన్నికల కంటే కూడా.. వైసీపీ పూర్తిగా దెబ్బతినేసింది. కనీసం డిఫెండ్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. సారీ చెప్పినా.. చేసిన పని చెరిగిపోనంత తీవ్రంగా ఉంది.
ఇక, గత ఏడాది కాలంగా కూడా.. వైసీపీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఏదో రకంగా పుంజుకునే ప్రయత్నాలు చేయాలని పార్టీ శ్రేయోభిలాషులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే నిరసనల పేరుతో పుంజుకునేందుకు పార్టీ అధినేత కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. ఇంతలోనే కృష్ణంరాజు రూపంలో పడిన వ్యాఖ్యల పిడుగు.. వైసీపీని పాతాళానికి నెట్టేసింది. ఎక్కడా కూడా వైసీపీ అని చెప్పుకొనే తిరిగే పరిస్థితి కూడా లేకుండా చేయడం దారుణం.