Begin typing your search above and press return to search.

మోడీకి దూరంగా జగన్ ?

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా రెండవ టెర్మ్ 2019లో అధికారంలోకి వచ్చినపుడు ఏపీలో జగన్ కూడా తొలిసారి సీఎం అయి పవర్ లోకి వచ్చారు.

By:  Tupaki Desk   |   2 May 2025 4:24 AM
Modi’s Visit to Amaravati and Jagan’s Absence
X

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా రెండవ టెర్మ్ 2019లో అధికారంలోకి వచ్చినపుడు ఏపీలో జగన్ కూడా తొలిసారి సీఎం అయి పవర్ లోకి వచ్చారు. అలా మోడీ జగన్ ల మధ్య రాజకీయంగా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అంతే కాదు మోడీ ప్రభుత్వానికి వైసీపీ అన్ని విధాలుగా ప్రత్యక్ష పరోక్ష అండదండలు ఇస్తూ మిత్రుడు కాని మిత్రుడుగా మారింది అని చెబుతారు.

అయితే అదంతా గతంలోకి మారిపోయింది. 2024 ఎన్నికలకు ముందు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతోనే వైసీపీకి దూరం పెరిగింది. జగన్ ఎంతగానో రాజకీయ ప్రత్యర్ధిగా చూస్తే టీడీపీతో బీజేపీ చేయి కలపడాన్ని సహించలేరనే అంటున్నారు.

ఇక ఆనాటి నుంచి వైసీపీ మెల్లగా బీజేపీకి దూరం అవుతూ వస్తోంది అని అంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత ఏపీలో లా అండ్ ఆర్డర్ టీడీపీ కూటమి పాలనలో అధ్వాన్నంగా ఉందని ఆరోపిస్తూ ఢిల్లీలో వైసీపీ ధర్నా చేపట్టింది. దానికి బీజేపీయేతర పార్టీలు హాజరు కావడం ఒక విశేషం.

ఆ మీదట ఈ మధ్యనే తమిళనాడు సీఎం స్టాలిన్ డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా మీటింగ్ పెడితే అందులోని అంశాలకు మద్దతు తెలియచేస్తూ వైసీపీ తన స్టాండ్ ని చెప్పింది. ఇక తాజాగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని వ్యతిరేకించింది. పార్లమెంట్ లో ఓటింగ్ వేళ మోడీ సర్కార్ కి యాంటీగా ఓటు వేసింది.

ఇలా చూస్తే కనుక నెమ్మదిగా బీజేపీకి మోడీకి జగన్ దూరం జరుగుతున్నట్లుగానే ఉన్నారని అంటున్నారు. ఇక ఇపుడు చూస్తే ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ మే 2న వస్తున్నారు. ఆయన అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు.

ఒక విధంగా చూస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం. అధికారికంగా నిర్వహిస్తున్న వేడుక. దీనికి విపక్ష నేతగా జగన్ కి ఆహ్వానం వెళ్ళింది. కానీ జగన్ అటెండ్ కాబోరు అన్నది ప్రచారంలో ఉంది జగన్ అయితే మోడీ ఏపీకి వస్తున్న వేళ బెంగళూరులో ఉంటారని అంటున్నారు.

మరి ఏపీలో మోడీ ఉంటే జగన్ వేరే రాష్ట్రంలో ఉండడం ఏమిటి అంటే దూరం గా జరిగినట్లేనా అన్న చర్చ సాగుతోంది. నిజమే ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఈ మీటింగ్ జరగవచ్చు కాక. కానీ ఇది ఏపీ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన మీటింగ్. అంతే కాదు రాజధాని కోసం మీటింగ్. ఏపీని అయిదేళ్ళు సీఎం గా పాలించిన జగన్ ఏపీ ప్రగతి కోసం బాటలు వేసేందుకు ప్రధాని వస్తున్న వేళ రాకుండా ఉంటే కనుక అది బాబుని రాజకీయంగా వ్యతిరేకించినట్లు కాదని మోడీకి కూడా దూరంగా జరుగుతున్నట్లు అని అంటున్నారు.

మోడీకి దూరంగా జరిగితే ఏపీలో వైసీపీ రాజకీయం కూడా ఒక సవాల్ గా మారుతుందని అంటున్నారు. అయితే వైసీపీ మాత్రం బాబుని వ్యతిరేకిస్తూ మోడీకి కూడా తెలిసో తెలియకుండానో దూరం అవుతోంది అంటున్నారు. రాజకీయంగా చూస్తే వైసీపీకి ఇది వ్యూహాత్మకమైన తప్పిదమని అంటున్న వారూ ఉన్నారు. మరి ఇంతకు మించిన ఎత్తుగడలు కానీ ఆలోచనలు కానీ వైసీపీకి ఉంటే ఓకే కానీ లేకపోతే బాబు వ్యతిరేకతే మోడీతో కూడా దూరం పెంచినట్లు అయితే మాత్రం వైసీపీ ఇబ్బందులో పడుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో. నిజంగా వైసీపీ మోడీకి దూరం అయినట్లేనా అన్నది కూడా చూడాలి.