Begin typing your search above and press return to search.

జగన్ కోసం టీడీపీ...రేర్ సీన్ ని అడ్డుకున్న పోలీస్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటన సాఫీగానే సాగింది. అయితే ఆయన పర్యటనకు హీట్ పుట్టించాలని టీడీపీ తమ్ముళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం బెడిసికొట్టింది

By:  Tupaki Desk   |   16 Oct 2023 8:07 AM GMT
జగన్ కోసం టీడీపీ...రేర్ సీన్ ని అడ్డుకున్న పోలీస్
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటన సాఫీగానే సాగింది. అయితే ఆయన పర్యటనకు హీట్ పుట్టించాలని టీడీపీ తమ్ముళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం బెడిసికొట్టింది. ముఖ్యమంత్రిని కలుస్తామని టీడీపీ తమ్ముళ్ళు కోరిన కోరికకు విశాఖ పోలీస్ నో చెప్పేసారు. జస్ట్ వినతిపత్రం ఇచ్చేందుకే అని టీడీపీ నేతలు చెబుతున్నా కూడా రాష్ట్రం లో ఇపుడు ఉన్న పరిస్థితులలో చంద్రబాబు జైలులో ఉన్న నేపధ్యంలో ఒక విధంగా హీటెస్ట్ పాలిటిక్స్ సాగుతోంది. దాంతో ముఖ్యమంత్రి వద్దకు టీడీపీ నేతలను అనుమతించడం లా అండ్ ఆర్డర్ దృష్ట్యా తగని పని భావించి కీలక నేతలను పోలీసులు. హౌజ్ అరెస్ట్ చేశారు

దీనికి ముందు టీడీపీ నేతలు అంతా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో సమావేశం అయి విశాఖ అభివృద్ధి గురించి జగన్ కి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. మరో వైపు చూస్తే విశాఖ అభివృద్ధి గురించి కూడా జగన్ అపాయింట్మెంట్ ఇస్తే చర్చిస్తామని కూడా టీడీపీ నేతలు ప్రకటించారు. అయితే ఏ ముఖ్యమంత్రి పర్యటనలోనూ ఇలాంటి చర్చలకు అవకాశం ఉండదని తెలుసు.

ఇక వినతిపత్రం పేరిట టీడీపీ నేతలు వచ్చి యాగీ చేస్తే దాని వల్ల లేని పోని ఇబ్బందులు వస్తాయని భావించి ముందు జాగ్రత్తగా గంటా శ్రీనివాసరావుతో సహా కీలక నేతలను అందరినీ హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక దీని మీద మీడియాతో మాట్లాడిన గంటా ముఖ్యమంత్రి జగన్ కి ఇదే చివరి అవకాశం అంటూ శాపనార్ధాలు పెట్టారు.

ఈసారికి ఏపీలో వైసీపీ వచ్చే చాన్స్ లేనే లేదని ఆయన జోస్యం చెప్పారు. ఏపీలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది అన్నారు. తాను రాజకీయంగా పాతికేళ్ళకు పైగా అనుభవం ఉన్నవాడిని అన్నారు. ఒక ముఖ్యమంత్రికి ఆ ప్రాంతానికి చెందిన నేతలు వినతిపత్రం ఇవ్వడం గతంలో జరిగేదని, ఈ సీఎం మాత్రం పాత్ర సంప్రదాయాన్ని పక్కన పెట్టారని ఆయన నిందించారు.

ఇన్ని రోజులూ ఉత్తరాంధ్రా అభివృద్ధి సీఎం కి కానీ వైసీపీ నేతలకు గానీ గుర్తుకు రాలేదని, ఇపుడు మాత్రం ప్రజలను మభ్యపెట్టడానికే ఇదంతా చేస్తున్నారని గంటా మండిపడ్డారు. రుషికొండ మీద జరుగుతున్నది టూరిజం గెస్ట్ హౌజ్ నిర్మాణం కాదని, సీఎం కార్యాలయ భవనం అని ఓపెన్ గా చెబితే తప్పేంటి అని గంటా నిలదీస్తున్నారు.

చంద్రబాబుని అకారణంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టారని, రానున్న రోజులలో టీడీపీ గెలుస్తుందని బాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని గంటా అంటున్నారు. వైసీపీ ఓడిపోతుందని కంగారు కలవరం ఉన్నందువల్లనే టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు అని ఆయన మండిపడుతున్నారు. మొత్తానికి ఒక వైపు శుభమా అని ఇన్ఫోసిస్ సహా అన్ని రకాల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలను ముఖ్యమంత్రి చేస్తూంటే సీఎం అడుగు పెట్టిన విశాఖ నుంచే వైసీపీ ఓడిపోతుందని టీడీపీ శాపనార్ధాలు పెట్టడం మాత్రం చిత్రంగా తోస్తోంది అని అంటున్నారు.