Begin typing your search above and press return to search.

జగన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం .... పొత్తుని చిత్తు చేసేలా...!

ఆ విధంగా చేయడం ద్వారా టోటల్ గా బీసీ వర్గాన్ని మొత్తం తన వైపునకు తిప్పుకోవాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు

By:  Tupaki Desk   |   27 Sep 2023 4:30 PM GMT
జగన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం  .... పొత్తుని చిత్తు చేసేలా...!
X

ఏపీలో రాజకీయం మొత్తం సామాజిక సమీకరణల మీద ఆధారపడి సాగుతూ ఉంటుంది. ఏపీలో ప్రధానంగా పార్టీలు అధికారంలోకి రావడానికి రెండు సామాజిక వర్గాలు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. తెలుగుదేశం పుట్టక ముందు అన్ని సామాజిక వర్గాలు కాంగ్రెస్ వెంట ఉండేవి.

టీడీపీ పుట్టాక బీసీలను తమ వెంట తిప్పుకుంది. వారిని అతి పెద్ద ఓటు బ్యాంక్ గా మార్చుకుంది. దాంతో ఎన్నికలలో గెలుపోటములతో సంబంధం లేకుండా టీడీపీ పటిష్టంగా ఉంటూ వచ్చింది. అయితే ఫస్ట్ టైం2019 ఎన్నికల్లో టీడీపీ బీసీ కోటను జగన్ బద్ధలు కొట్టారు. బీసీలకు తమ ప్రభుత్వంలో పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. ఎంతలా అంటే కీలకమైన పదవులు అన్నీ వారికే అప్పగిస్తున్నారు. మంత్రివర్గంలో పది మందికి తక్కువ లేకుండా బీసీ మంత్రులు ఉండడం గ్రేట్ అనే అంటున్నారు.

మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాజకీయం మార్చేందుకు టీడీపీ జనసేన పొత్తులు పెట్టుకున్నాయి. జనసేన అండతో కాపులను తమ వైపునకు తిప్పుకోవచ్చు అని టీడీపీ ఆలోచిస్తోంది. అదే టైం లో గోదావరి జిల్లాలలో బీసీలు ఎటు వైపు అన్నది మరో చర్చకు తావిస్తోంది. ఇక ఉత్తరాంధ్రా అంటేనే బీసీల జిల్లాలుగా చెబుతారు.

అటువంటి ఉత్తరాంధ్రాలో కూడా పొత్తుల వల్ల రాజకీయం మార్చేలా వైసీపీ కొత్త ఆలోచనలు చేస్తొంది అని అంటున్నారు. మొత్తం కోస్తా జిల్లాలలో బీసీలకు కనీసంగా ఎనభై నుంచి తొంబై దాకా సీట్లు ఇచ్చేందుకు వైసీపీ పక్కా ప్లాన్ తో ఉందని అంటున్నారు.

ఇది నిజంగా కనుక అమలు చేస్తే మాత్రం జగన్ ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసిన వారు అవుతారు అంటారు. జగన్ కూడా అదే విషయం మీద ఫోకస్ పెట్టారని అంటున్నారు. అందుకే కేవలం పనితీరు ఆధారంగానే ఎమ్మెల్యేలకు టికెట్లు నో చెప్పరని అంటున్నారు. వారు సమర్ధులుగా ఉంటూ బాగా పనిచేస్తూన్నా సోషల్ ఇంజనీరింగ్ నేపధ్యంలో టికెట్ దక్కదని అంటున్నారు. అలా ఈసారి బీసీలకు పెద్ద పీట వేయడం ద్వారా టీడీపీ జనసేన పొత్తుని దెబ్బకొట్టాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే సమర్ధులుగా ఉంటూ సామాజిక సమీకరణల నేపధ్యంలో టికెట్ దక్కని వారిని తెచ్చి ఎంపీలుగా పోటీ చేయించాలని కూడా జగన్ ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది. అదే టైంలో బీసీ నేతలను కీలకంగా ఉన్న గెలుపు గుర్రాలని తెచ్చి ఎమ్మెల్యేలుగా పోటీకి దించాలని కూడా భావిస్తున్నారు అని అంటున్నారు.

ఆ విధంగా చేయడం ద్వారా టోటల్ గా బీసీ వర్గాన్ని మొత్తం తన వైపునకు తిప్పుకోవాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. ఈ కారణంగా వైసీపీలో ఒక ప్రామినెంట్ సామాజిక వర్గానికి ఈసారి టికెట్లు తక్కువ దక్కుతాయని అంచనా కడుతున్నారు. 2019లో వైసీపీ ఇచ్చిన టికెట్లలో అధిక భాగం రెడ్లకు అన్నది తెలిసిందే. వారు సైతం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రస్తుతం వైసీపీలో దాదాపుగా నలభై నుంచి యాభై మంది దాకా ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

ఇపుడు వారిలో కొంతమందిని ఎంపీలుగా పంపించాలని ప్లాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే మరికొందరికి టికెట్లు ఇవ్వకపోయినా ప్రభుత్వం మరోసారి ఏర్పడితే కీలక పదవులు ఇచ్చేందుకు రెడీగా ఉంటామని హామీ ఇస్తారని తెలుస్తోంది. ఇక రెడ్లతో పాటు మరికొన్ని అగ్ర సామాజిక వర్గాలకు ఈసారి టికెట్లు తగ్గుతాయని అంటున్నారు.

గత ఎన్నికల్లో బ్రాహ్మణులకు జగన్ నాలుగు టికెట్లు ఇచ్చారు. అయితే అందులో ఇద్దరు గెలిచారు, ఇద్దరు ఓడారు. అలా గెలిచిన వారిలో మల్లాది విష్ణు, కోన రఘుపతి మరోసారి గెలిచే పరిస్థితి లేదని అంటున్నారు. దాంతో అక్కడ కచ్చితంగా మార్పులు ఉంటాయని తెలుస్తోంది.

వైశ్య కమ్యూనిటీలో కూడా గతంలో నాలుగైదు టికెట్లు ఇచ్చారు. ఈసారి ఆ సంఖ్య తగ్గుతుందని అంటున్నారు. గోదావరి జిల్లాల్తో పాటు విశాఖలో ఒక సీటుని రాజులకు ఇస్తారని తెలుస్తోంది. కమ్మ సహా ఇతర అగ్ర వర్ణాల సీట్లలో కొన్ని బీసీలకు పోతాయని తెలుస్తోంది. మొత్తానికి జగన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం టీడీపీ జనసేన పొత్తుని చిత్తు చేసేలా దిమ్మ దిగిరేలా ఉంటుందని అంటున్నారు. రెండవసారి ఎలాంటి విఘ్నాలు లేకుండా గెలుపు సాధించాలన్నదే జగన్ మార్క్ ప్లాన్ అని తెలుస్తోంది.