Begin typing your search above and press return to search.

వ‌చ్చినా వ‌ద‌ల‌ను.. తేల్చేసిన ష‌ర్మిల‌.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల చుట్టూ.. గ‌త నాలుగు రోజులుగా జ‌రుగుతున్న చ‌ర్చకు తాజాగా ఆమె ఫుల్ స్టాప్ పెట్టార‌ని తెలిసింది.

By:  Garuda Media   |   3 Jun 2026 12:00 PM IST
వ‌చ్చినా వ‌ద‌ల‌ను.. తేల్చేసిన ష‌ర్మిల‌.. !
X

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల చుట్టూ.. గ‌త నాలుగు రోజులుగా జ‌రుగుతున్న చ‌ర్చకు తాజాగా ఆమె ఫుల్ స్టాప్ పెట్టార‌ని తెలిసింది. క‌ర్ణాట‌క రాష్ట్ర కోటాలో ఆమె రాజ్య‌స‌భకు వెళ్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ రాష్ట్రంలోనాలుగు స్థానాలు ఖాళీ అవుతుండ‌గా.. మూడు స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే ద‌క్క‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఒక స్థానాన్ని ష‌ర్మిల‌కు ఇస్తార‌ని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే.. ఆమె రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌నున్నారు.

దీంతో ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ప‌ద‌విని వ‌దులుకుంటార‌ని స‌మాచారం. దీంతో ఆశావ‌హులు.. త‌మ ప్ర‌య‌త్నాలు తాము చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రులు, ఏఐసీసీ ప్ర‌తినిధులు, గ‌తంలో ఏఐసీసీలో ప‌నిచేసిన‌వారు.. రాహుల్‌గాంధీతో ట‌చ్‌లో ఉన్న‌వారిని క‌లుసుకుంటున్నారు. ఏపీపీసీసీ ప‌ద‌విని త‌మ‌కు ఇవ్వాల‌ని కోరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.అ యితే.. నిజానికి ష‌ర్మిల‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తున్న‌ట్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకా ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

అంతేకాదు.. ఒక‌వేళ రాజ్య‌స‌భ సీటు ఇచ్చినా.. ఆమెను ఏపీసీసీ ప‌ద‌వినుంచి త‌ప్పిస్తామ‌ని కూడా కాంగ్రెస్ ఎక్క‌డా చెప్ప‌లేదు. అయితే.. గ‌తంలో ప‌లు రాష్ట్రాల్లో తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు.. ఇక్క‌డి నాయ‌కులు అలెర్ట్ అయ్యారు. అందుకే.. ఏపీసీసీ ప‌ద‌విని త‌మ‌కు ఇవ్వాలంటే.. త‌మ‌కు ఇవ్వాలంటూ.. కొంద‌రు నాయ‌కులు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై ష‌ర్మిల‌.. త‌న అనుచ‌రుల‌తో మాట్లాడి న‌ట్టు తెలిసింది.

రాజ్య‌స‌భ సీటు వ‌చ్చినా.. ఏపీసీసీ ప‌ద‌విని వ‌దిలి పెట్ట‌నని చెప్పార‌ని స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌డపలో అవినాష్ రెడ్డిని ఓడించ‌డం.. అక్క‌డ పాగా వేయ‌డం త‌న ల‌క్ష్యంగా ఆమె పేర్కొన్న‌ట్టు తెలిసింది. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీని పుంజుకునేలా చేసే విష‌యంలో త‌న పాత్ర ఎప్ప‌టికీ స‌జీవంగానే ఉంటుందని.. కూడా ష‌ర్మిల తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. సో.. దీనిని బ‌ట్టి.. ష‌ర్మిల‌కు.. రాజ్య‌స‌భ‌సీటు ద‌క్కినా.. ఆమె మాత్రం ఏపీసీసీ పీఠాన్ని వ‌దిలే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్ట‌మైంది.