Begin typing your search above and press return to search.

టార్గెట్లు ఏమ‌య్యాయి? జ‌గ‌న్ ఆరా.. నేత‌ల‌పై సీరియ‌స్‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్ .. పార్టీ నాయ‌కుల‌పై సీరియ‌స్ అయ్యారా? తాను పెట్టిన టార్గెట్ల‌ను లైట్ తీసుకున్న‌వారిపై ఆయ‌న ఆగ్ర హం వ్య‌క్తం చేశారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

By:  Garuda Media   |   21 May 2026 12:57 PM IST
టార్గెట్లు ఏమ‌య్యాయి?  జ‌గ‌న్ ఆరా.. నేత‌ల‌పై సీరియ‌స్‌!
X

వైసీపీ అధినేత జ‌గ‌న్ .. పార్టీ నాయ‌కుల‌పై సీరియ‌స్ అయ్యారా? తాను పెట్టిన టార్గెట్ల‌ ను లైట్ తీసుకున్న‌వారి పై ఆయ‌న ఆగ్రహం వ్య‌క్తం చేశారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి వ‌చ్చిన విశ్వ‌స‌నీయ స‌మాచారం మేరకు.. గ‌త రెండు మాసాల్లో జ‌గ‌న్ జిల్లాల ఇంచార్జ్‌లుగా ఉన్న వైసీపీ సీనియ‌ర్ల‌ కు కొన్ని టార్గెట్లు పెట్టార‌ని తెలిసింది. ముఖ్యంగా పాత నేత‌ల‌ను తిరిగి పార్టీలోకి తీసుకురావ‌డంతోపాటు.. ప్ర‌స్తుతం ఉన్న కార్య‌క‌ర్త‌ల‌ను మ‌రింత‌గా ఎంగేజ్ చేయాల‌ని.. వారిలో మ‌రింతగా అంకిత భావాన్ని పెంచేలా కార్య‌క్ర‌మాల‌ను రూపొందించాల‌ని కూడాఆదేశించిన‌ట్టు తెలిసింది.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది నాయ‌కులు అస‌లు ఈ వ్య‌వ‌హారాల‌ను ప‌ట్టించుకోలేద‌ని.. స‌మాచారం. పైగా.. పార్టీ అధిష్టానం ఇస్తున్న పిలుపు మేర‌కు కార్య‌క్ర‌మాల‌ను కూడా మొక్కుబ‌డిగానే నిర్వ‌హించ‌డంపైనా..జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన నాయ‌కుల‌ను తిరిగి తీసుకురావ‌ల‌ని.. గ‌త ఏడాది కాలంగా పార్టీ నాయ‌కుల‌కు జ‌గ‌న్ చెబుతున్నారు. కానీ, ఈ విష‌యంలో పోయిన వారు.. పెద్ద‌గా స్పందించ‌డం లేదు. పైగా.. వైసీపీపై విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు. అయితే.. మ‌న‌సు మార్చుకున్న‌వారు వ‌స్తామంటే.. పార్టీలోకి తీసుకురావాల‌న్న‌ది జ‌గ‌న్ వ్యూహంగా ఉంది.

అదే విధంగా క్షేత్ర‌ స్థాయిలో నాయ‌కుల వ్య‌వ‌హార శైలి పైనా.. జ‌గ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. కార్య‌క‌ర్త‌ల‌ను స‌మీక‌రించ‌డంతో పాటు.. నాయ‌కుల‌తో క‌లివిడిగా ఉండేలా.. వారికి భ‌రోసా క‌ల్పించేలా చూడాల‌ని కూడా చెబుతున్నారు. కానీ, ఈ విష‌యంలో కార్య‌క‌ర్త‌ల‌కు-నాయ‌కుల‌కు మ‌ధ్య గ్యాప్ అలానే కొన‌సాగుతోంది. ఐదేళ్లు అధికారంలో ఉన్నా.. త‌మ‌ను పట్టించు కోలేద‌న్న ఆవేద‌న కార్య‌క‌ర్త‌ల్లో ఉంది. దీనిని త‌గ్గించి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వారిని కార్యోన్ముఖుల‌ను చేయాల‌న్న‌ది జ‌గ‌న్ వ్యూహం. ఈ విష‌యంలోనూ నాయ‌కులు వెనుక‌బ‌డ్డార‌ని.. ఇలా అయితే.. ఎలా..? అని కీల‌క నాయ‌కుల‌ను ఉద్దేశించి జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి.