Begin typing your search above and press return to search.

పోలీసుల సోదరుల్లారా....టోన్ మార్చిన జగన్

ఇక తాజాగా బంగారుపాళ్యంలో జగన్ టూర్ చేసినపుడు పోలీసుల మీద టోన్ మార్చి మాట్లాడరు. పోలీసు సోదరులారా అని ఆయన సంభోదించారు.

By:  Tupaki Desk   |   9 July 2025 9:11 PM IST
పోలీసుల సోదరుల్లారా....టోన్ మార్చిన జగన్
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పోలీసుల విషయంలో ఇప్పటిదాకా ఏమి మాట్లాడారో అంతా చూస్తూ వచ్చారు పోలీసులకు ఆయన ఆగ్రహంతో కొన్ని సందర్భాలలో వార్నింగులు కూడా ఇచ్చారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన వారు ఎక్కడ ఉన్న వెనక్కి తీసుకుని వచ్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు. అది సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా అని కూడా వెతికి తెస్తామని కూడా అన్నారు.

ఇక మరో సందర్భంలో అయితే బట్టలూడదీసి జనం ముందు పెడతామని అన్నారు. ఈ వ్యాఖ్యల మీద పోలీసు సంఘం వారు కూడా తప్పు పడుతూ ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి విధితమే. దీంతో జగన్ ఏమనుకున్నారో ఏమో కానీ పోలీసుల మీద అగ్రెసివ్ గా వ్యాఖ్యలు చేయడం లేదు. అది రెంటపాళ్ళ అయినా బంగారుపాళ్యం అయినా పోలీసుల విషయంలో జగన్ కొంత సంయమనం పాటిస్తున్నారు.

ఇక తాజాగా బంగారుపాళ్యంలో జగన్ టూర్ చేసినపుడు పోలీసుల మీద టోన్ మార్చి మాట్లాడరు. పోలీసు సోదరులారా అని ఆయన సంభోదించారు. ఈ రోజు మీరు మమ్మల్ని కట్టడి చేస్తున్నారు. అయితే మీకు కూడా సమస్యలు ఉంటాయి. చంద్రబాబు ప్రభుత్వం మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది. అపుడు పలికేవారు జగన్ అని గుర్తు పెట్టుకోండి అని సున్నితంగానే చెప్పారు.

మీ కోసం కూడా నేను రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తాను అని జగన్ వారికి చెప్పారు. అందువల్ల మీరు రూల్స్ ని దాటి వేరేగా వ్యవహరించవద్దు అని సూచించారు. అంతే కాదు వైసీపీని కట్టడి చేయాలని పెద్దలు కానీ ఉన్నత అధికారులు కానీ చెప్పినా మీరు పద్ధతి ప్రకారమే వెళ్లాలని కోరారు.

ఏపీలో అన్ని వర్గాలను చంద్రబాబు సర్కార్ మోసం చేసిందని పోలీసుల విషయంలో కూడా అలా ఎందుకు జరగదని జగన్ ప్రశ్నించారు. అందువల్ల మీకు కూడా నేను అండగా ఉంటాను అని ఒక అభయం ఇచ్చారు. నన్ను కనుక కట్టడి చేస్తే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవారు ఒక్కరు కూడా ఉండరని జగన్ అంటున్నారు.

ప్రభుత్వం చేసే తప్పులను ప్రతిపక్షంగా నిలదీయడం తమ బాధ్యత అన్నారు. అంతే కాదు తాను పొగాకు రైతులను మిర్చీ రైతులను మామిడి రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు తమ పార్టీ వారిని నియంత్రించడం మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే జగన్ ఈసారి పోలీసులకు కొంత అనుకూలంగా మాట్లాడడం విశేషం. మొత్తానికి చూస్తే జగన్ తన పర్యటనలకు ఇబ్బందులు వరసబెట్టి ఎదురవడంతో పోలీసుల మీద నేరుగా ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. పై నుంచి ఆదేశాలు వస్తున్నాయని వాటిని పాటిస్తే మీకే ఇబ్బందులు వస్తాయని సూచిస్తున్నారు. మరి పోలీసు సోదరుల్లారా అని జగన్ చేసిన ఈ సంభోదన పట్ల ఖాకీల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.