Begin typing your search above and press return to search.

యూకేలో వైసీపీ సోషల్ మీడియా టీం... అంబరాన్నింటిన ఆత్మీయ సమ్మేళన సంబరాలు!

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి సుమారు 450 మందికి పైగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యి విజయవంతం చేశారు

By:  Tupaki Desk   |   16 Oct 2023 4:13 AM GMT
యూకేలో వైసీపీ సోషల్ మీడియా టీం... అంబరాన్నింటిన ఆత్మీయ సమ్మేళన సంబరాలు!
X

యూకే వైఎస్సార్సీపీ కన్వీనర్ డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో లండన్ లో ఆ పార్టీ సోషల్ మీడియా సమావేశం జరిగింది. ఆధ్యాంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమం.. దిగ్విజయంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు అందరం అండగా నిలవాలని సభికులంతా నిర్ణయించారు.


అవును... యూకే లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మీడియా - సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి, ఏపీ ఎన్.ఆర్.టీఎస్. అధ్యక్షులు మేడపాటి వెంకట్, ఏపీ ఎస్.ఎస్.డీ.సీ. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి, వైఎస్సార్సీపీ అమెరికా కన్వీనర్ పండుగాయల రత్నాకర్ హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి సుమారు 450 మందికి పైగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా... రానున్న ఎన్నికలలో వైసీపీ సోషల్ మీడియా పాత్ర, సోషల్ మీడియా కార్యకర్తల పాత్ర, అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు మొదలైన విషయాలపై చర్చించారు.. వక్తలు విలువైన సూచనలు చేశారు.


ఈ సందర్భంగా... సజ్జల భార్గవ్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా... రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రతి క్షణం జగనన్న కష్టపడుతున్నారుని తెలిపారు. ఇదే సమయంలో... ప్రజా సంక్షేమమే కాదు, అవినీతి పరుల గుండెల్లో సింహ స్వప్నంగా జగనన్న నిలిచారని అన్నారు. ఇదే సమయంలో దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు అందరం అండగా నిలవాలని భార్గవ్ రెడ్డి కోరారు.


అదేవిధంగా... ఏపీలో గ్రామాలను సీఎం జగనన్న ఎంత అభివృద్ధి చేశారో మీరంతా భారతదేశం వచ్చినప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారని ఈ సందర్భంగా యూకేలోని తెలుగువారికి సజ్జల భార్గవ్ రెడ్డి తెలిపారు. ఇక, రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో ఎలా పని చేయాలనే విషయాలను వెల్లడించిన ఆయన... "వైనాట్ 175" లక్ష్యంగా అందరూ కలిసి కట్టుగా పనిచేద్దామని సూచించారు. ఇదే సమయంలో ఏ కష్టం వచ్చినా తాను ఉంటానని సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి భార్గవ్ రెడ్డి హామీ ఇచ్చారు!