Begin typing your search above and press return to search.

సిద్ధం సభలతో వైసీపీ డిక్లేర్ చేసేసిందా...!?

సిద్ధం పేరుతో మూడు ప్రాంతాలలో మూడు సభలు జగన్ నిర్వహించారు. ఈ సభలు అన్నీ కూడా లక్షలాది మంది వైసీపీ క్యాడర్ తో నిండిపోయాయి.

By:  Tupaki Desk   |   19 Feb 2024 3:34 AM GMT
సిద్ధం సభలతో వైసీపీ డిక్లేర్ చేసేసిందా...!?
X

సిద్ధం పేరుతో మూడు ప్రాంతాలలో మూడు సభలు జగన్ నిర్వహించారు. ఈ సభలు అన్నీ కూడా లక్షలాది మంది వైసీపీ క్యాడర్ తో నిండిపోయాయి. భీమిలీ సభ సౌండ్ చేసింది అనుకుంటే దానికి మించినదిగా ఏలూరు సభ రీ సౌండ్ చేసింది. ఇపుడు రాప్తాడు సభ అయితే బ్రహ్మాండంగా సాగింది.

ఈ మూడు సభలు వైసీపీ స్టామినా ఏమిటో నిరూపించాయి. ప్రతీ నియోజకవర్గంలో ప్రతీ ప్రాంతంలో ఎపుడూ జరిగే సభలు కాదు , ఏపీ మొత్తంలో మూడు ప్రధాన ప్రాంతాలు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సభ. మూడంటే మూడు సభలు దెబ్బకు మాడు పగలాసిందే అన్నట్లుగా వైసీపీ సిద్ధం సభలు జరిగాయి.

ఈ సభలలో ఒక్క విషయం అయితే కచ్చితంగా అందరికీ అర్ధం అయింది. జగన్ గ్లామర్ ఇంకా తగ్గలేదని, అలాగే వైసీపీ క్యాడర్ గ్రౌండ్ లెవెల్ లో బాగా ఉందని, అదే టైం లో వైసీపీ ఎన్నికల ముంగిట ఎక్కడా తడబడడం లేదు అని.

నిజానికి ఎన్నికలు దగ్గర పడుతూంటే అధికార పార్టీకి ముచ్చెమటలు పోస్తాయి. కానీ మేము సిద్ధం మీరు సిద్ధమా అని చాలెంజ్ విసరడంలోనే వైసీపీ సక్సెస్ మంత్రం ఉందని అంటున్నారు. విపక్షం ఇంకా సర్దుకోకముందే మేము సిద్ధం అని జనంలోకి వైసీపీ వెళ్తోంది.

సిద్ధం సభలు హోరెత్తించాయి. ఎంతలా అంటే ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు పుట్టించేలా. ఈ సభలు మూడు ప్రాంతాలలో వైసీపీకి గట్టి పట్టు ఉందని నిరూపించాయి. క్యాడర్ కి లీడర్ కి మధ్య కనెక్షన్ కరెక్ట్ గా సెట్ అయింది అని కూడా చెప్పుకొచ్చాయి. ఎన్నికల్లో చొక్కాలు మడత పెట్టి మరీ సమరానికి సై అంటామని క్యాడర్ గట్టి భరోసా ఇచ్చేలా చేశాయి.

సిద్ధం సభలతో మొత్తం 175 నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ కూ జగన్ సందేశం పంపించారు. అదే సమయంలో జనాలకూ ఒక సంకేతం ఇచ్చారు. విపక్షాలకు ఒక పెద్ద సంశయం మిగిల్చారు. వైసీపీ అంటే ఒక్క చాన్స్ పార్టీ కాదని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని జగన్ చెప్పకనే చాటి చెప్పారు.

సిద్ధం సభల వల్ల విపక్షాలకు తెలియాల్సింది చాలానే ఉంది. జగన్ ని ఓడించడం కష్టమే అన్నదే ఆ సందేశం. జగన్ కి క్రేజ్ మోజూ చాలానే ఉంది. అది ఒక్క ఛాన్స్ పోదు అని కూడా ఈ సభల ద్వారా అర్ధం అవుతోంది. జగన్ ని ఓడించాలంటే ఇంకా చాలా చేయాలన్నది కూడా ప్రతిపక్షానికి అర్ధం అవుతోంది.

ఏది ఏమైనా జగన్ మూడు సభలు వైసీపీ సదా సిద్ధం అన్నది చెప్పేశాయి. వైసీపీ కూడా వ్యూహాత్మకంగా తమదే విజయం అని డిక్లర్ చేసేసింది. మరోసారి మాకే చాన్స్ జనాలు ఇస్తారు అని కూడా ఎంతో ధీమాతో చెప్పుకొచ్చింది.