Begin typing your search above and press return to search.

ఆ ఓట్లు 65 శాతం వస్తే వైసీపీకి 95 సీట్లు గ్యారంటీ...!

కాబట్టి వైసీపీ ఎలక్షన్ స్ట్రాటజీ ఇదే అని అర్ధం అవుతోంది. ఏపీలో మొత్తం రెండున్నర లక్షల కోట్లను ప్రజల ఖాతాలోకి నేరుగా నగదు వేశారు.

By:  Tupaki Desk   |   6 Feb 2024 8:37 AM GMT
ఆ ఓట్లు 65 శాతం వస్తే వైసీపీకి 95 సీట్లు గ్యారంటీ...!
X

ఏపీలో అధికార వైసీపీ మళ్ళీ గెలుస్తుందా అన్న చర్చ సాగుతోంది. విపక్ష కూటమి బలంగా ముందుకు వస్తున్న వేళ రెండవసారి గెలుపు సాధించి జగన్ రికార్డు సృష్టిస్తారా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఇక వరసబెట్టి గెలవడం అన్నది విన్నింగ్ మ్యాజిక్ అంటారు. దానిని జగన్ సాధించి తిరుగులేదు అనిపించుకుంటారా అన్నది కూడా అంతా చూస్తున్నారు.

ఏపీలో చూస్తే ఎన్నికలు గట్టిగా రెండు నెలల ముంగిటకు వచ్చేశాయి. ఎన్నికల వేడి అయితే అంతటా ఉంది. అధికార వైసీపీ సిద్ధం సభలతో హోరెత్తిస్తూంటే విపక్ష తెలుగుదేశం రా కదలిరా అని అంటోంది. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో వైసీపీకి ఉన్న ధీమా ఏంటి గెలిచే సీట్లు ఎన్ని అన్నది ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా వెల్లడి అవుతున్నా కూడా విపక్షం కూడా ఏమీ తక్కువ తినడం లేదు.

మాదే గెలుపు అని టీడీపీ అధినాయకత్వం తో పాటు జనసేన అధినేత పవన్ ధీమాగా ఉన్నారు. ఇక ఏపీలో చూస్తే ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఓటు బ్యాంక్ అన్నది వైసీపీకి ఫలానా ఉంది అని అంటున్నారు. జగన్ అయిదేళ్ల పాలనలో చూస్తే కనుక సంక్షేమానికి పెద్ద పీట వేశారు.

అయన గత అయిదేళ్లలో 124 సార్లు బటన్ నొక్కాను అని తానే స్వయంగా బహిరంగ సభలలో జనాలకు చెప్పుకున్నారు. దీనిని బట్టి చూస్తే జగన్ బటన్ నొక్కుడు ఓట్ల మీదనే పూర్తిగా ఆధారపడ్డారు అని అర్ధం అవుతోంది అంటున్నారు. జగన్ వ్యూహాలు ఏంటి అన్నవి ఆయన సిద్ధం సభలలో చెబుతున్న దాన్ని బట్టి తీసుకుంటే నేను బటన్ నొక్కి సంక్షేమ పధకాలు ప్రతీ ఇంటికీ చేర్చాను కాబట్టి అవి మళ్ళీ కంటిన్యూ కావాలంటే నాకే ఓట్లు వేయండి అని కోరుతున్నారు.

కాబట్టి వైసీపీ ఎలక్షన్ స్ట్రాటజీ ఇదే అని అర్ధం అవుతోంది. ఏపీలో మొత్తం రెండున్నర లక్షల కోట్లను ప్రజల ఖాతాలోకి నేరుగా నగదు వేశారు. ఇది దేశంలో ఎపుడూ జరగలేదు. సగటున చూస్తే అయిదేళ్లలో ప్రతీ కుటుంబానికి రెండు నుంచి మూడు లక్షల దాకా వివిధ పధకాల ద్వారా అందాయని లెక్క ఉంది

ఏపీలో మొత్తం ఓటర్లు తాజా జాబితా ప్రకారం చూస్తే నాలుగు కోట్ల పది లక్షల దాకా ఉన్నారు. అందులో 85 శాతం మందికి జగన్ పధకాలు అందాయని అంటున్నారు. అంటే ఇది మూడున్నర కోట్ల కంటే ఎక్కువ. అయితే వీరంతా మళ్లీ ఓట్లేస్తే వైసీపీ తప్ప మరే పార్టీ అధికారంలోకి రాదు. అయితే ఇందులో కూడా ఫిల్టరింగ్ ఉంది.

ఇతర పార్టీలకు లబ్ది చేకూర్చారు. కానీ వారు మాత్రం తమ అభిమాన పార్టీలకే ఓట్లు వేస్తారు. అలాగే వైసీపీ పధకాలు అందుకుంటున్నా ఆ పార్టీకే వేయాలన్నది కూడా లేని వారు కూడా ఉన్నారు. దీని మీద కచ్చితమైన లెక్క కోసం లబ్దిదారులను సర్వే చేస్తే కటాకటిన 65 శాతం మంది మాత్రమే జగన్ బటన్ నొక్కుడు పధకాలకు అనుకూలంగా ఓట్లు వేస్తారు అని అంటున్నారు.

వారు మాత్రమే జగన్ కోసం తాము రెండు సార్లు బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఈ నంబర్ ని ఓట్లుగా కన్వర్ట్ చేస్తే రెండు కోట్ల పై చిలుకు ఓటర్లు మాత్రమే జగన్ వైపు ఉన్నట్లుగా స్పష్టం అవుతుంది. అంటే సగానికి ఒకింత ఎక్కువ. దాన్ని సీట్లుగా కన్వర్ట్ చేసుకుంటే కనుక మొత్తం 175 సీట్లకు గానూ జగన్ కి 95 సీట్లు రావచ్చు అన్నది సెఫాలజిస్టులు చేస్తున్న సర్వేలలో వెల్లడి అవుతున్న విషయంగా ఉంది అంటున్నారు.

ఇక ఈ సర్వేలలో తేలుతున్న విషయం ఏంటి అంటే ఎగువ మధ్యతరగతి వర్గాలు, యువత, నిరుద్యోగులలో నూటికి ఎనభై శాతం ఓట్లు టీడీపీకే పడతాయని లెక్క తేల్చారు. ఇక ఏపీలో చూస్తే రూరల్ అర్బన్ సెక్టార్ రెండుగా డివిజన్ ఉంది. ఇందులో అర్బన్ సెక్టార్ అంతా టీడీపీకి జై కొడుతోంది. అయితే మొత్తం అసెంబ్లీ సీట్లలో అర్బన్ సీట్లు ముప్పయి శాతం మాత్రమే ఉండడం వైసీపీకి ఒకింత సేఫ్ గా ఉంది.

ఈ అర్బన్ సెక్టార్ లో నూటికి 75 శాతం ఓట్లు టీడీపీకే పడతాయని అంటున్నారు. ఇక రూరల్ బేస్ అంతా వైసీపీకి జై కొడుతోంది. అక్కడే వైసీపీ బలంగా ఉంది అని అంటున్నారు. ఇక వైసీపీ పధకాల వల్ల లబ్ది పొందినది కూడా ఎక్కువగా రూరల్ సెక్టార్ లోనే కావడం వైసీపీకి అసలైన బలం అని అంటున్నారు.

వైసీపీ లబ్దిదారులలో నూటికి అరవై అయిదు శాతం మంది వైసీపీకే వేస్తామని చెప్పడం వల్ల వైసీపీ ఎన్నికలలో 95 సీట్లతో బయటపడే అవకాశం అయితే ఉంది అన్నది సర్వేల మొత్తం విశ్లేషణగా కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే వైసీపీ 2024 ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు బటన్ నొక్కుడు పధకాలే కారణం అవుతాయని అది కూడా రూరల్ బెల్ట్ లోనే అని సర్వేలు తేల్చుతున్నాయి. సో వైసీపీకి ఈసారి గెలుపు గ్యారంటీ ఉన్నా గతంలో వచ్చిన 151 సీట్లలో 55 దాకా కోల్పోతుంది అన్నది కూడా ఈ సర్వేలు చెబుతున్న నగ్న సత్యం. సో అలెర్ట్ గా అధికార పార్టీ ఉండాల్సిందే అని అంటున్నారు.