Begin typing your search above and press return to search.

మండలిలో వైసీపీకి కూటమి చెక్ పెడుతుందా ?

ఇదిలా ఉంటే చైర్మన్ కొయ్యే మోషెన్ రాజు రాజీనామాలు చేసిన అయిదుగురు వైసీపీ ఎమ్మెల్సీలను విచారణకు పిలిపించారు. వారి రాజీనామాల గురించి వివరణ తీసుకున్నారు.

By:  Satya P   |   27 Feb 2026 9:25 AM IST
మండలిలో వైసీపీకి కూటమి చెక్ పెడుతుందా ?
X

ఏపీ శాసనమండలిలో వైసీపీ ఆధిపత్యానికి బ్రేకులు పడే రోజులు దగ్గరలో ఉన్నాయని అంటున్నారు. శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటే అందులో వైసీపీకి సంఖ్యాపరంగా చూస్తే కనుక వైసీపీకి 34 తెలుగుదేశం పార్టీకి 10 బీజేపీకి రెండు 2, జనసేన 2, ఇండిపెండెంట్లు 5 ఖాళీలు 5 ఉన్నాయి. ఇదిలా ఉంటే చైర్మన్ కొయ్యే మోషెన్ రాజు రాజీనామాలు చేసిన అయిదుగురు వైసీపీ ఎమ్మెల్సీలను విచారణకు పిలిపించారు. వారి రాజీనామాల గురించి వివరణ తీసుకున్నారు.

జనసేన కండువాతో :

ఇక చూస్తే కనుక జనసేన కండువాతో వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ హాజరయ్యారు. ఆయన తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ ని కోరారు ఎవరి ఒత్తిడి తన మీద లేదని తానుగానే రాజీనామా చేశాను అని ఆయన వివరణ ఇచ్చారు. ఇదే వరసలో వైసీపీ నుంచి రాజీనామా చేసిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి దుర్గా ప్రసాద్, మర్రి రాజశేఖర్ కూడా తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నారు. దాంతో ఈ విషయంలో ఇపుడు చైర్మన్ మోషెన్ రాజు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

కీలక నిర్ణయమేనా :

చైర్మన్ రాజీనామా చేసిన ఎమ్మెల్సీలను పిలిపించుకుని విచారణ చేశారు అంటే కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే మండలిలో ఏకంగా అయిదు స్థానాలు ఒకేసారి ఖాళీ అవుతాయి. ఆ అయిదు కూటమి పార్టీలకే వెళ్తాయని అంటున్నారు. ఎందుకంటే కూటమికే శాసనసభలో బలం ఉంది. అలాగే కూటమిలోని మూడు పార్టీలే ఈ సీట్లు తీసుకోనున్నాయి.

మరో 19 ఖాళీలు :

ఇంకో వైపు చూస్తే 2027 నాటికి పూర్తిగా మండలిలో కూటమికి పూర్తి ఆధిక్యత వస్తుందని అంటున్నారు. ఏకంగా పది మందికి పైగా వైసీపీ ఎమ్మెల్సీలు ఆనాటికి పదవీ విరమణ చేయనున్నారని అంటున్నారు. వారిలో దువ్వాడ శ్రీనివాస్, ఇషాక్ భాషా, దేవ సాని చిన గోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్, మొహమ్మద్ రహుల్లా ఉన్నరు. వీరు కాకుండా స్థానిక సంస్థల కోటాలో పది మంది ఎమ్మెల్సీలు, గవర్నర్ నామినేట్ చేసిన ఇంకో నలుగురు ఎమ్మెల్సీలు కూడా 2027 నాటికి రాజీనామా చేస్తారు. దాంతో వైసీపీకి మండలిలో బలం చూస్తే ఏకంగా 15 కి పడిపోతుంది అని చెప్పాలి. అయితే ఈ లోగానే మరికొంతమంది ఎమ్మెల్సీలు కనుక కూటమి వైపు వస్తే చాలా తొందరగానే మండలిలో కూటమి ఆధిపత్యం పెరిగిపోతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా చైర్మన్ ఈ విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకునేలా ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. పెద్దల సభలో రాజకీయాలు ఏ తీరుగా మారనున్నాయో.