వైసీపీలో కసి పెంచుతున్నారు.. కాక రేగుతుందా ..!
ప్రస్తుతం జరుగుతున్న అరెస్టు.. నమోదవుతున్న కేసులు.. వైసీపీలో కాకరేపుతున్నాయి. ఒక కేసు నుంచి బయటకు రాగానే.. మరో కేసు నమోదవుతోంది. అంతేకాదు.. ఒక కేసులో రిలీఫ్ దక్కిందని అనుకునే లోగానే మరో కేసు పెడుతున్నారు.
By: Tupaki Desk | 21 July 2025 11:00 PM ISTప్రస్తుతం జరుగుతున్న అరెస్టు.. నమోదవుతున్న కేసులు.. వైసీపీలో కాకరేపుతున్నాయి. ఒక కేసు నుంచి బయటకు రాగానే.. మరో కేసు నమోదవుతోంది. అంతేకాదు.. ఒక కేసులో రిలీఫ్ దక్కిందని అనుకునే లోగానే మరో కేసు పెడుతున్నారు. రాజకీయాల్లో సౌమ్యం.. విధానపరమైన నిర్ణయాలకు.. గతంలోనే చెల్లు చీటి పలికిన నేపథ్యంలో ఇప్పుడు కూటమి సర్కారును అనుకుని ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే.. వైసీపీ హయాంలో అప్పటి మాజీ మంత్రులు.. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నారాయణ సహా చంద్రబాబును అరెస్టు చేసిన తీరు తెలిసిందే.
సో.. ఇప్పుడు కూటమి నాయకులు కూడా అదేపంథాను పాటిస్తున్నారు. దీంతో పార్టీల మధ్య విభజన రేఖ లు మరింత పెరుగుతున్నాయి. అంటే.. కూటమి నాయకులు, పార్టీలు ఎలా ఉన్నా.. వైసీపీలో మాత్రం .. తీవ్రస్థాయిలో నాయకులు రగులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. ఇది ఏమేరకు కసిని పెంచుతుం ది? ఏమేరకు.. వచ్చే ఎన్నికల్లో బలమైన పాత్రను పోషించేలా నాయకులను కదిలిస్తుంది? అనేది ప్రశ్న. సాధారణంగా.. టీడీపీ నాయకులను గతంలో అరెస్టు చేసినప్పుడు.. వారి వారి నియోజకవర్గాల్లో కసి పెరిగింది.
అందుకే.. నాయకులు అరెస్టయిన నియోజకవర్గాల్లో వారే గెలిచారు. కూటమి ప్రభావం ఉన్నా.. లేకపోయినా.. నారాయణ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర సహా.. అందరూ విజయం దక్కించుకున్నారు. దీనికి కారణం తమ నాయకులను అరెస్టు చేశారన్న కసి.. కార్యకర్తల్లోనూ.. కేడర్‌లోనూ పెరిగింది. అయితే.. ఇప్పుడు అదే తరహాలో సింపతీని గెయిన్ చేసేందుకు.. కార్యకర్తల్లో కసి పెంచేందుకు వైసీపీ కూడా ప్రయత్నించనుంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ ఇదే విషయంపై పార్టీ నాయకులతో చర్చించారు.
ప్రస్తుతం జరుగుతున్న అరెస్టులు.. కేసుల విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని.. ముఖ్యంగా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలని ఆయన ఆదేశించారు. అయితే.. ఎంత మంది వస్తారు? నిజం గానే కసి ఉంటుందా? గతంలో టీడీపీలో రగిలిపోయినట్టు వైసీపీలో కూడా కార్యకర్తలు రగులుతారా? అ నేది చూడాలి. ప్రస్తుతానికి కొంత మేరకు ఊపు కనిపిస్తున్నా.. తప్పులు చేశారు కాబట్టే అరెస్టులు జరుగుతు న్నాయన్న చర్చ ఈ సింపతీని డామినేట్ చేస్తోంది. దీంతో వైసీపీ ఆశించినట్టుగా కసి ఉన్నా.. ఫైర్ కనిపించడం లేదు.
