Begin typing your search above and press return to search.

భర్త బ్రదర్ తో రిలేషన్.. నిద్రమాత్రలతో చావలేదని షాకిచ్చి చంపింది

ఇష్టం లేని పెళ్లి.. భర్త కంటే బెటర్ గా వివాహేతర సంబంధం.. గతంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే గుట్టు చప్పుడు కాకుండా తమ దారి తాము చూసుకునేటోళ్లు.

By:  Tupaki Desk   |   20 July 2025 10:41 AM IST
భర్త బ్రదర్ తో రిలేషన్.. నిద్రమాత్రలతో చావలేదని షాకిచ్చి చంపింది
X

ఇష్టం లేని పెళ్లి.. భర్త కంటే బెటర్ గా వివాహేతర సంబంధం.. గతంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే గుట్టు చప్పుడు కాకుండా తమ దారి తాము చూసుకునేటోళ్లు. గడిచిన కొన్నేళ్లుగా కొత్త ట్రెండ్ మొదలైంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది. దేశంలోని ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా ఇష్టం లేని భర్తను వదిలించేందుకు దారుణ రీతిలో ప్లాన్ చేసి చంపేసే కొత్త ఎత్తుగడను ఫాలో అవుతున్నారు భార్యలు. ఇటీవల కాలంలో ఈ తరహా దుర్మార్గాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ ఉదంతాల్లో భర్తల చావుల కోసం భార్యలు చూపే క్రూరత్వం షాకింగ్ గా మారుతోంది.

ఇప్పుడు అలాంటి దుర్మార్గమే ఒకటి ఢిల్లీ వేదికగా బయటకు వచ్చింది. భర్తకు సోదరుడు వరస అయ్యే కుర్రాడితో వివాహేతర సంబంధంతో కట్టుకున్నోడ్ని కడతేర్చే వరకు వెళ్లింది. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ఉత్తమ్ నగర్ కు చెందిన సుస్మిత తన భర్త 36 ఏళ్ల కరణ్ దేవ్ విద్యుత్ షాక్ కు గురైనట్లుగా ఈ నెల పదమూడున ఆసుపత్రికి తీసుకొచ్చారు.

బాధితుడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మరణించినట్లుగా ధ్రువీకరించారు. ఆమె మాటల్ని నమ్మి.. ప్రమాదమే చోటు చేసుకుందని భావించిన కరణ్ కుటుంబ సభ్యులు పోస్టుమార్టం వద్దని చెప్పారు. అయితే.. చనిపోయిన కరణ్ దేవ్ కు సోదరుడు వరసయ్యే 24 ఏళ్ల రాహుల్ తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు పోస్టుమార్టం చేయిస్తే బాగుంటుందని సూచించారు.

ఇదే సమయంలో బాధితుడి సొంత సోదరుడు కునాల్ కు డౌట్ వచ్చింది. దీంతో అతడు వదిన సుస్మిత ఇన్ స్టా ఛాటింగ్ ను చెక్ చేశాడు. అందులో రాహుల్ తో మర్డర్ ప్లానింగ్ గురించి చర్చించిన విషయాన్ని గుర్తించి.. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ సందర్భంగా షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి.

రాహుల్ తో వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను వదిలించుకునేందుకు మర్డర్ ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా నిందితులు తొలుత భోజనంలో 15 నిద్ర మాత్రలు కలిపి ఇచ్చారు. అయినా ఊపిరి ఆగకపోవటంతో.. కరెంట్ షాకిచ్చి ఊపిరి తీసిన వైనాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుల్ని కస్టడీకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. భర్త నచ్చకపోతే విడిపోతే మహా అయితే.. బంధువులు.. ఇళ్లలో చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తిగా మాత్రమే ముద్ర వేసే ప్రమాదం ఉంది.

కానీ.. హత్య చేస్తే.. జైలుతో సహా జీవితంలో అవసరం లేని ఎన్నో అంశాల్లో చిక్కుకోవాల్సి వస్తుందన్న చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారన్నది ప్రశ్న. అంతేకాదు.. హత్యతో పాటు నేరం ఏం చేసినా తప్పించుకునే అవకాశం ఒక శాతం కంటే తక్కువే ఉంటుంది. పట్టుబడేందుకే 99 శాతం అవకాశం ఉంది. ఇలాంటప్పుడు నేరం చేసి అడ్డంగాబుక్ అవ్వాల్సిన అవసరం ఏమిటి? జీవితాన్ని తమ చేతులతో తామే నాశనం చేసుకోవాల్సిన పనేమిటన్నది ప్రశ్న.