Begin typing your search above and press return to search.

జగన్ లో ధీమా...బాబులో ఆందోళన...రీజన్ ఇదే !?

ఏపీలో ఎవరు గెలుస్తారు అన్న దాని మీద రకరకాలైన సర్వేలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 April 2024 6:01 PM GMT
జగన్ లో ధీమా...బాబులో ఆందోళన...రీజన్ ఇదే !?
X

ఏపీలో ఎన్నికల ప్రచారం మంచి ఊపు మీద సాగుతోంది. ఈ ప్రచారంలో అటూ ఇటూ వాడి వేడి విమర్శలు చేసుకుంటున్నారు. ఇక పోలింగ్ డేట్ చూస్తే కనుక నెల రోజుల కంటే తక్కువకు వచ్చేసింది. ఏపీలో ఎవరు గెలుస్తారు అన్న దాని మీద రకరకాలైన సర్వేలు వస్తున్నాయి.

కొన్ని సర్వేలు వైసీపీ గెలుస్తుంది అంటూంటే మరికొన్ని సర్వేలు టీడీపీ కూటమికి పట్టం కడుతున్నాయి. అయితే సర్వేలు ఎలా ఉన్నా అటు వైసీపీ అధినేత జగన్ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబులను చూసినపుడు జగన్ లో ఎక్కడ లేని ధీమా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అదే బాబులో ఆందోళన కనిపిస్తోంది.

ఎందుకు ఇలా జరుగుతోంది అన్నదే చర్చగా ఉంది. నిజానికి చంద్రబాబు సేఫ్ జోన్ లో ఉన్నారు. గతంలో అంటే 2019 ఎన్నికల్లో జరిగిన తప్పులను ఆయన ఈసారి సరిదిద్దుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని వ్యవస్థలతో సాఫీగా అన్నీ సాగేలా చూసుకుంటున్నారు. ఇక గత ఎన్నికల్లో తమ ఓట్లకు చిల్లు పెట్టిన జనసేనతో పొత్తు పెట్టుకుని తమకు అనుకూలం చేసుకున్నారు.

పటిష్టంగానే కూటమి ఉంది. వైసీపీ వ్యతిరేక ఓట్లు నూటిని తొంబై శాతం పైగా కూటమికి పడే చాన్స్ ఉంది. దాంతో పాటు ఏపీలో జగన్ కాకపోతే చంద్రబాబు వైపే జనాలు చూస్తారు. ఇక ఎవరెన్ని చెప్పినా మరెన్ని సర్వేలు వచ్చినా కూడా ఏపీలో హోరా హోరీ పోరు ఉందని ఏకపక్షంగా లేదని అంతా అంటున్నారు.

దాంతో పాటుగా బలంగా కూటమి కట్టిన టీడీపీకి ఎంతో కొంత ఎడ్జ్ ఉండే చాన్స్ ఉండే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. మరి ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నా కూడా చంద్రబాబు ఎందుకు ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారు అన్న చర్చ వస్తోంది. కొద్ది నెలల ముందు జరిగిన తెలంగాణా ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపించారు. ఆ ఎన్నికల్లో అయన కేసేఆర్ తొందరలో మాజీ సీఎం కాబోతున్నారు అని ప్రతీ సభలో చెబుతూ ఉండేవారు.

అంతే కాదు డిసెంబర్ తొమ్మిదిన తాను సీఎం గా ప్రమాణం చేస్తాను అని కూడా ఆయన చెబుతూ వచ్చారు. అలా నెల రోజుల ముందు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని జనంలో పాజిటివ్ వేవ్ ని క్రియేట్ చేశారు. కానీ ఏపీలో చూస్తే చంద్రబాబు అలా గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అన్న చర్చ సాగుతోంది.

ఇక జగన్ ఎందుకు ధీమాగా ఉన్నారు అంటే జగన్ అయితే బంపర్ విక్టరీ లేకపోతే విపక్షం అయినా బేఖాతరు అన్నట్లుగా ప్రిపేర్ అయ్యారని అంటున్నారు. ఆయన ప్రస్తుతం వయసు 52 ఏళ్ళు మాత్రమే. మరో ఎన్నికకు అంటే 57 ఏళ్ళు వస్తాయి. ఇప్పటి నుంచి మరో రెండు దశాబ్దాల పాటు ఆయన రాజకీయం చేసే సత్తాను కలిగి ఉన్నారు. దాంతో ఆయన సర్వేలను సైతం పక్కన పెట్టి ధీమాగా ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు.

ఇక జగన్ ఫేస్ లో ఏ భావాన్ని కనిపించకపోవడం ఆయనకు అడ్వాంటేజ్ అని అంటున్నారు. ఆయన ఎక్కడా తన ముఖ కవలికలలో మార్పు లేకుండా చూసుకుంటున్నారు. అంతే కాదు ముఖంలో చిరునవ్వుతో కనిపిస్తున్నారు. దీంతోనే ఆయన జనంలో వైసీపీకి పాజిటివిటీని తెస్తున్నారు. ఒకవేళ వైసీపీకి ఓట్లూ సీట్లూ తగ్గినా జగన్ ధీమా చూసిన వారు మనసు మార్చుకుని వచ్చేది వైసీపీయే అని ఆ వైపు టర్న్ అయ్యే చాన్స్ ఉంది. అలా వ్యూహాత్మకంగా జగన్ నడచుకుంటూంటే చంద్రబాబు మాత్రం సభలలో తన ముఖంలో ఆందోళన అంతా కనిపించేలా ప్రసంగాలు చేస్తున్నారు.

దానికి కారణం ఏంటి అంటే ఆయనకు దాదాపుగా ఇవే చివరి ఎన్నికలు. ఎన్నికల్లో సర్వేలు ఎన్ని అనుకూలంగా చెప్పినా జనాలు ఓట్లు వేసి గెలిపించేవరకూ అసలైన ఫలితం తెలియదు. గెలిస్తే ఓకే. ఒకవేళ ఓడితే మాత్రం టీడీపీ భవిషత్తు ఏమిటి అన్న ఆందోళన ఆయనలో ఉంది అని అంటున్నారు. అందుకే ఆయన అంత ధీమాగా బయటకు కనిపించక లేకపోతున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ బాబు ఈ ఇద్దరినీ చూసినపుడు వారి సభలను చూసినపుడు జగన్ లో గెలుపు ధీమా కనిపిస్తుంటే బాబులో ఆందోళన కనిపిస్తోంది. ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే మాత్రం ఇబ్బందే అని అంటున్నారు.