Begin typing your search above and press return to search.

ఛీ..ఛీ.. ఇదెక్కడి డ్రామా బుద్ధా వెంకన్న?

జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం బాగోలేని కారణంగా.. ఆయన్ను ఫ్యామిలీ డాక్టర్ కు చూపించేందుకు అనుమతి ఇవ్వాల్సిందని ముఖ్యమంత్రి జగన్ ను కోరటం ఏమిటి?

By:  Tupaki Desk   |   14 Oct 2023 7:13 AM GMT
ఛీ..ఛీ.. ఇదెక్కడి డ్రామా బుద్ధా వెంకన్న?
X

రాజకీయ పార్టీలు.. నేతలు తమకు ప్రాణాధారమైన మైలేజీ కోసం తెగ తపిస్తుంటారు. దాన్ని తప్పు పట్టలేం. కానీ.. సమయం, సందర్భం చూసుకోకుండా రొడ్డు కొట్టుడు పద్దతిలో బిహేవ్ చేసే పనులు.. ఉన్న కాస్తంత సానుభూతిని పోయేలా చేయటమే కాదు.. చిరాకు పెట్టేలా మారుతుందన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించటమే ముఖ్యోద్దేశమే అయితే.. అందుకు వ్యవహరించాల్సిన పద్దతి ఇదేనా? అన్నది ప్రశ్న.

వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన వేళ.. అతితో ఉన్న సానుభూతి సైతం పోయేలా చేయటంలో అర్థం లేదన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు ఎందుకు మిస్ అవుతున్నట్లు? రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదన్న అంశంపై ముఖ్యమంత్రి జగన్ ను కలిసి.. ఆయన్ను కనీసం ఫ్యామిలీ డాక్టర్ ను కలిసేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాలని కోరుతామని పేర్కొంటూ సీఎం నివాసం వద్ద టీడీపీ నేతలు బుద్దా వెంకన్న.. పిల్లి మాణిక్యాలరావులు చేసిన హడావుడి.. చూసే వారికి చిరాకు తెప్పించేలా మారిందని చెప్పాలి.

జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం బాగోలేని కారణంగా.. ఆయన్ను ఫ్యామిలీ డాక్టర్ కు చూపించేందుకు అనుమతి ఇవ్వాల్సిందని ముఖ్యమంత్రి జగన్ ను కోరటం ఏమిటి? జైల్లో ఉన్నది సీఎం జగన్ ఆదేశాలతోనా? కోర్టు ఆదేశాలతోనా? ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును విచారించిన కోర్టు.. చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు పంపాలని ఆదేశించిన విషయాన్ని వదిలేసి.. ముఖ్యమంత్రి ఇంటి వద్ద హడావుడి చేయటంలో అర్థముందా?

ప్రతిపక్ష నేత ఎదుర్కొంటున్న ఇబ్బందిని ముఖ్యమంత్రిని కలిసి వివరించటమే ఆలోచన అయితే.. అందుకు చేయాల్సిందేంటి? ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రిని కలిసేందుకు టీడీపీ పార్టీ తరఫున ఒక టీం వస్తుందని.. అందుకు సమయాన్ని ఇవ్వాలని సీఎంవోను సంప్రదించాలి కదా? అందుకు.. సీఎంవో నిరాకరిస్తే.. ఆ విషయాల్ని తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేయటం.. ఆందోళన చేపట్టటం బాగుంటుంది.

అందుకు భిన్నంగా మధ్యాహ్నం వేళ.. ఉన్నపళంగా టీడీపీ నాయకులు.. కార్యకర్తలు వాహనాల్లో తాడేపల్లి పాత టోల్ గేట్ కూడలి వద్దకు రావటం ఏమిటి? అక్కడున్న పోలీసులు అనుమతులు లేవని అడ్డుకుంటే.. హైడ్రామాను క్రియేట్ చేయటం ఏమిటి? అన్నది ప్రశ్న. అప్పటికి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించేందుకు వచ్చినట్లుగా చెప్పగా.. ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని చెప్పగా.. దానిపై వాదన సాగింది.

దీంతో.. పోలీసులు సైతం ముందస్తు అనుమతి లేకుంటే కలవటం కుదరదని చెప్పటంతో.. బుద్దా వెంకన్న అండ్ కో ఎమోషనల్ అయ్యారు. ‘మీ కాళ్లు పట్టుకుంటాం. సీఎంను కలవనివ్వండి. చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదు’ అంటూ వేడుకోవటంలో అర్థం లేదని చెప్పాలి. నిజంగానే చంద్రబాబు ఆరోగ్యంపై అంత ఆందోళన ఉంటే.. హైకోర్టులోనూ.. సుప్రీంకోర్టులో పిటీషన్లు వేసి.. ఆయన ఆరోగ్యంపై జైల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని.. ఆయనకు కల్పిస్తున్న భద్రతపై తమకు సందేహాలు ఉన్నాయని.. వాటిని రూఢీ చేసుకోవటానికి వైద్యుల టీంను పంపాలని పిటిషన్లు దాఖలు చేయొచ్చు కదా? అది వదిలేసి.. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద హడావుడి చేయటం చూస్తే.. బాబు ఆరోగ్యం కంటే కూడా పొలిటికల్ మైలేజీ మీదనే ఎక్కువ ఫోకస్ ఉందన్న భావన కలుగక మానదు. బుద్ధా వెంకన్న లాంటి వారి తీరు ఏవగింపు కలిగేలా చేస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.