Begin typing your search above and press return to search.

'వ్యూహం`.. లోకేష్‌కు ఆ అర్హ‌త లేదా?

అయితే.. ఇది టీడీపీ అధినేత చంద్ర‌బాబు, పార్టీ నాయ‌కుడిగా త‌న ప‌రువును భ‌గ్నం చేసేలా ఉంద‌ని ఆరోపిస్తూ.. ఆ పార్టీ నేత నారా లోకేష్ కోర్టును ఆశ్ర‌యించారు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 12:46 PM GMT
వ్యూహం`.. లోకేష్‌కు ఆ అర్హ‌త లేదా?
X

ఏపీ స‌హా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిన వ్య‌వ‌హారం.. వ్యూహం సినిమా. వ‌చ్చే ఎన్నిక‌ల ను ప్ర‌భావితం చేసేలా.. సీఎం జ‌గ‌న్ విష‌యంలో గ‌తంలో `ఏం జ‌రిగింది` అనే విష‌యాన్ని క‌ళ్ల‌కు క‌డుతూ.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ఇది. కొన్ని రోజుల కింద‌ట వ్యూహం సినిమా కు సంబంధించి ట్రైల‌ర్ వ‌చ్చింది. అయితే.. ఇది టీడీపీ అధినేత చంద్ర‌బాబు, పార్టీ నాయ‌కుడిగా త‌న ప‌రువును భ‌గ్నం చేసేలా ఉంద‌ని ఆరోపిస్తూ.. ఆ పార్టీ నేత నారా లోకేష్ కోర్టును ఆశ్ర‌యించారు.

దీనిపై తాజాగా ఏపీ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. రామ్‌గోపాల్ వ‌ర్మ‌(వ్యూహం) త‌ర‌ఫున వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, ప్ర‌ముఖ న్యాయ‌వాది ఎస్ . నిరంజ‌న్ రెడ్డి వాద‌న‌లు వినిపించారు. అస‌లు నారా లోకేష్‌కు పిటిష‌న్ వేసే అర్హ‌తే లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇలాంటి సినిమాల‌ను నిషేధించ‌డానికి అనుమ‌తులు లేవ‌న్న‌ ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయని తెలిపారు. అసలు నారా లోకేష్ వేసిన రిట్ పిటిషన్ పరిగణలోకి రాదని కోర్టుకు తెలిపారు.

``ఇలాంటి సినిమాల‌కు అనుమ‌తి ఇవ్వాలా? వ‌ద్దా.. అనే విష‌యం తేల్చాల్సింది సెంట్రల్ సెన్సార్ బోర్డు కమిటి. ఏదైనా తేడా ఉంటే.. సెన్సార్ బోర్డు స‌భ్యులు అడ్డుకుంటారు. అస‌లు స‌ర్టిఫికేట్ ఇవ్వ‌రు. ఒకవేళ వాళ్ళు అబ్జెక్షన్ చేయాలి. కానీ, ఈ సినిమా విష‌యంలో నిపుణుల కమిటి ఎలాంటి అడ్డు చెప్పకుండా సెన్సార్ బోర్డు వ్యూహం చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చింది`` అని నిరంజన్ రెడ్డి వాదించారు.

వ్యక్తులను, పార్టీలను కించపరిచే విధంగా ఉంటే సివిల్ కోర్టులో వారు పరువు నష్ట దావా వేసుకోవాలే త‌ప్ప‌.. ఇలా కోర్టుల‌కు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. హైకోర్టులో పిటిష‌న్ వేసే అర్హ‌త నారా లోకేష్‌కు లేద‌న్నారు. ``వ్యూహం అనేది డాక్యుమెంటరీ చిత్రం కాదు. కళాకారులకు, ద‌ర్శ‌కుడికి కూడా స్వేచ్చ ఉంటుంది. న్యాయస్థానాలు ఎక్కడా ఇలాంటి కేసుల్లో జోక్యం చేసుకోలేదు. గతంలో తెలంగాణ హైకోర్టు సైతం ఇలాంటి కేసుల్లో అనేక తీర్పులు ఇచ్చింది`` అని నిరంజ‌న్ రెడ్డి తెలిపారు.

వ్యక్తులను, వ్యవస్థ లను కించపరిచే విధంగా ఉంటే సివిల్ సూట్ వేసుకోవచ్చని నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఇక్కడ పిటిషన్ వేసే అర్హత లేదని వాదించారు. కాగా, ఈ సినిమా విడుద‌ల‌కు ముందే తీవ్ర వివాదానికి దారి తీసిన విష‌యం తెలిసిందే. వ‌ర్మ త‌ల న‌ర‌కితెస్తే.. రూ.కోటి ఇస్తాన‌ని కొలిక పూడి శ్రీనివాస‌రావు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆర్జీవీ కేసు పెట్టారు. ఇక‌, టీడీపీ కూడా.. ఈ సినిమాను అడ్డుకుంటామ‌ని పిలుపునిచ్చింది.