Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ ముందే గుజరాత్ రికార్డు బద్ధలు !

గుజరాత్ ను ఏకంగా పదమూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పాలించిన నరేంద్ర మోడీ ఆ తర్వాత దేశానికి ప్రధాని అయ్యారు.

By:  Tupaki Desk   |   6 Jun 2025 8:00 AM IST
ప్రధాని మోడీ ముందే గుజరాత్ రికార్డు బద్ధలు !
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్ర గుజరాత్ అని అందరికీ తెలిసిందే. గుజరాత్ ను ఏకంగా పదమూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పాలించిన నరేంద్ర మోడీ ఆ తర్వాత దేశానికి ప్రధాని అయ్యారు. ఆయన గత పదకొండేళ్ళుగా ప్రధానిగా కొనసాగుతున్నారు.

ఇదిలా ఉంటే గుజరాత్ అంటే మోడీకి స్పెషల్ అని అంటారు. అతి పెద్ద సర్దార్ వల్లభాయ్ విగ్రహం గుజరాత్ ఉంది. అంతే కాదు 2023లో అంతర్జాతీయ యోగా డే వేళ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఒక లక్షా యాభై మూడు వేల మందితో ఒకే చోట యోగాసనాలు నిర్వహించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుకు ఎక్కింది.

ఇది ప్రపంచ రికార్డు. మళ్ళీ ఆ రికార్డు ఇప్పటిదాకా బద్ధలు కాలేదు. అయితే గుజరాత్ రికార్డుని బద్ధలు కొట్టే పనిలో ఏపీ ఉంది. ఏపీలో విశాఖ వేదికగా ఈ నెల 21న జరిగే వరల్డ్ యోగా డేకి దేశ ప్రధాని మోడీ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లతో కలసి యోగాసనాలు వేస్తారు.

ఇక విశాఖలో ఆ రోజు ఏకంగా అయిదు లక్షల మంది ఒకే చోట యోగాసనాలు వేస్తారు. ఇది గుజరాత్ రికార్డుకు మూడింతలు కంటే ఎక్కువ. దాంతో విశాఖలో ఈ నెల 21న గుజరాత్ గిన్నీస్ రికార్డు బద్ధలు కాబోతోంది. ఈ రికార్డుని మోడీ సమక్షంలోనే బద్ధలు కొట్టనున్నారు. ఏపీలో ఆ రోజు జరిగే యోగా డేని మోడీ కళ్ళారా చూడనున్నారు విశాఖ నుంచి భీమునిపట్నం దాకా మొత్తం 36 కిలోమీటర్ల దాకా మొత్తానికి మొత్తం ఆ రోజు అంతా ఒక్క చోట చేరి యోగాసనాలు వేయనున్నారు.

ఇది అద్భుతానికే అధ్బుతంగా ఉండనుంది. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డుకు ఎక్కనుంది. దాంతో సమీప భవిష్యత్తులో విశాఖ రికార్డుని ఎవరూ బద్ధలు కొట్టలేరని అంటున్నారు. గుజరాత్ రికార్డుని కేవలం రెండేళ్లలో విశాఖ బద్ధలు కొట్టబోతోంది అంటే దాని వెనక చంద్రబాబు ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు విశాఖలో యోగా డేని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దాంతో భారీ రికార్డు సాధించే దిశగా ఇప్పటికే విశాఖ సిద్ధమైపోయింది.

అంతే కాదు ఏపీలో ఆ రోజు ఏకంగా రెండు కోట్ల మంది ప్రజలు యోగా దినోత్సవంలో పాలు పంచుకోబోతున్నారు. ఆ విధంగా ఏపీ కూడా కొత్త చరిత్ర సృష్టించబోతోంది. మొత్తం అయిదు కోట్ల జనాభా ఉన్న ఏపీలో రెండు కోట్ల మంది ఒకే రోజున యోగాలో పాల్గొనబోతున్నారు అంటే అదో చరిత్రగా ఉండబోతోంది.

చంద్రబాబు నాయక్త్వాన టీడీపీ కూటమి ప్రభుత్వం యోగా డేని సీరియస్ గా తీసుకుని కృషి చేయడంతోనే ఇదంతా సాధ్యపడింది అని అంటున్నారు. మరి ప్రధాని మోడీ కళ్ళెదుటే గుజరాత్ రికార్డు బ్రేక్ కాబోతున్న జూన్ 21 ఏపీకి వెరీ స్పెషల్ అని అంటున్నారు. ఆ రోజు కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.