మరో ముంబైలా విశాఖ...చంద్రబాబు మాస్టర్ ప్లాన్
ఏపీలో ఇపుడు అతి పెద్ద నగరంగా విశాఖ ఉంది. అమరావతి రాజధాని నగరంగా అభివృద్ధి చేయడానికి చాల సమయం పడుతుంది.
By: Tupaki Desk | 7 Jun 2025 8:30 AM ISTఏపీలో ఇపుడు అతి పెద్ద నగరంగా విశాఖ ఉంది. అమరావతి రాజధాని నగరంగా అభివృద్ధి చేయడానికి చాల సమయం పడుతుంది. దాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక వైపు అమరావతి అభివృద్ధిని చూస్తూనే మరో వైపు రెడీ మేడ్ సిటీగా ఉన్న విశాఖ మీద ఫుల్ ఫొకస్ పెట్టారు. ఇప్పటికే విశాఖలో పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు.
అలాగే విశాఖను ఐటీ హబ్ గా చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. అవకాశం ఉంటే సినీ రాజధానిగా చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక పర్యటక సిటీగా విశాఖను చేయాలన్నది కూడా ఉంది. వీటితో పాటు ఇపుడు మరో మహత్తర ఆలోచనను కూటమి ప్రభుత్వం చేస్తోంది.
విశాఖను మరో ఏడళ్ళలో ముంబైతో సమానంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం ప్రణాళికగా ఉంది. ఈ నేపధ్యంలో విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల ఎకానమీ విశాఖ నంబర్ వన్ ఎకనామిక్ రీజియన్ గా మారాలన్నది కూటమి లక్ష్యంగా ఉందని అంటున్నారు.
ఇక చూస్తే కనుక విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా ఇలా మొత్తం ఎనిమిది జిల్లాల పరిధిలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలని ముక్యమంత్రి అధికారులకు సూచించారు.
విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో వివిధ ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విశాఖ కనుక ముంబై మాదిరిగా ఎకనామిక్ రీజియన్ గా మారితే 20 లక్షల మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ కిన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దాని కోసం ఒక భారీ కార్యాచరణను సైతం రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇక శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట కాకినాడ మధ్య బీచ్ రహదారి అభివృద్ధి చేయలాని, అలాగే ఆరు పోర్టులు ఏడు మాన్యుఫాక్చరింగ్ నోడ్లు, పదిహేడు మేజర్ వ్యవసాయ క్షేత్రాలు ఆరు సర్వీస్ హబ్స్ పన్నెండు పర్యాటక హబ్స్‌తో విశాఖ ఎకనమిక్ రీజియన్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
36 వేల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో 15.5 మిలియన్ జనాభా కలిగి వున్న విశాఖ రీజియన్‌లో ప్రస్తుతం 49 బిలియన్ డాలర్ల జీడీడీపీ నమోదవుతోంది. దీనిని కనుక 2032 నాటికి ఎకనామిక్ రీజియన్ గా అభివృద్ధి చేస్తే 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతే కాదు ఈ ప్రాంతం ప్రగతితో పాటుగా రాష్ట్ర పురోగతిలో సైతం విశాఖ కీలకం కానుంది.
అలాగే వచ్చే ఏడేళ్ళలో ఐటీ రంగంలో కనీసం నాలుగు నుంచి అయిదు లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలా లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దనికి అనుగుణంగా డేటా సెంటర్లు స్టార్టప్‌లు-ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ మేరకు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి విశాఖ ఏకనామిక్ రీజియన్ గురించి కీలకమైన సూచనలు ప్రతిపాదనలతో కూడిన ఆదేశాలను జారీ చేశారు.
