Begin typing your search above and press return to search.

బీజేపీ తిరంగా ర్యాలికీ బాబు పవన్

ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ పీచమణచిన తర్వాత బీజేపీ సైనికులను అభినందిస్తూ భారత మాతను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను నిర్వహిస్తోంది.

By:  Tupaki Desk   |   15 May 2025 1:21 PM IST
బీజేపీ తిరంగా ర్యాలికీ  బాబు పవన్
X

ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ పీచమణచిన తర్వాత బీజేపీ సైనికులను అభినందిస్తూ భారత మాతను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను నిర్వహిస్తోంది. ఆసేతు హిమాచలం ఈ తిరంగా యాత్ర సాగనుంది. ఈ నెల 23 వరకూ సాగే ఈ తిరంగా యాత్ర ఏపీలో కూడా చాలా చోట్ల చేపడుతున్నారు. మాజీ సైనిక అధికారులతో పాటు మేధావులు ప్రజలు యువత వివిధ రంగాలలోని ప్రముఖులతో ఈ యాత్రను నిర్వహిస్తూ భారత మాతకు బాసటగా ఉందాం, సైనికులకు అండగా ఉందామని నినిదిస్తున్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడలో నిర్వహించే తిరంగా ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వారిద్దరిని ఇప్పటికే ఆహ్వానించారు.

దేశంలోని జవాన్లకు మద్దతుగా సంఘీభావంగా నిర్వహించే తిరంగా యాత్రను ఏపీలో విజయవాడ నడిబొడ్డున టీడీపీ కూటమికీబు మూడు పార్టీలు నిర్వహిస్తాయని ఆమె చెప్పరు. ఇక శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే తిరంగా ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచీ బెంజిసర్కిల్ వరకూ పెద్ద ఎత్తున కొనసాగుతుంది.

ఈ తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు, డిప్యుటీ పవన్ కళ్యాణ్ లతో పాటుగా మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ సహా అనేక మంది ప్రముఖులు సైతం హాజరవుతారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో జరిగే తిరంగా ర్యాలీలో బాబు పవన్ పాల్గొంటే కనుక అది సూపర్ హిట్ అవుతుంది. విజయవాడ జనసంద్రం అవుతుంది. అంతే కాదు ఈ సందేశం జనాలకు పెద్ద ఎత్తున రీచ్ అవుతుంది. భారత మాతాకు జై అన్న నినాదాలు నలు దిక్కులా పిక్కటిల్లుతాయి.

భారత దేశం కోసం సైన్యం సరిహద్దులలో అప్లుపెరని తీరులో సాగిస్తున్న పోరాటం గురించి యువతకు కూడా సందేశం అందుతుంది. ఈ దేశం నాది అన్న భావనతో పాటు ఉగ్ర మూకలను చీల్చి చెండాడాలన్న ఒక కఠిమైన సందేశం కూడా జన బాహుళ్యంలోకి చొచ్చుకుని పోతుంది.

దేశంలో ప్రతీ చోటా తిరంగా ర్యాలీ సాగుతోంది కానీ విజయవాడలో మాత్రం చంద్రబాబు పవన్ హాజరైతే ఆ ర్యాలీ నభూత నభవిష్యత్తు అన్నట్లుగా సాగుతుందని పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందని అంటున్నారు. మొత్తానికి ఈ తిరంగా ర్యాలీ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.