Begin typing your search above and press return to search.

ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు... వేణుస్వామి తాజా అంచనా ఇదే!

జగన్ రాశి, నక్షత్రాలు చాలా అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఎలా చూసుకున్నా ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చేది జగనే అని క్లారిటీ ఇచ్చారు!

By:  Tupaki Desk   |   10 April 2024 5:10 AM GMT
ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు... వేణుస్వామి తాజా అంచనా ఇదే!
X

ఏపీలో రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ఎలాగైనా గద్దెదింపాలని కూటమి బలంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఇప్పటికే చంద్రబాబు – పవన్ లు బీజేపీని కూడా కలుపుకున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ - కమ్యునిస్టులు జత కట్టి జగన్ పై దండయాత్రకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఎవరు ఎన్ని గ్రూపులుకట్టినా రానున్న ఎన్నికల్లో విజయం తమదే అని వైసీపీ ధీమాగా చెబుతున్నారు. ఈ సమయంలో వేణుస్వామి ఎంటరయ్యారు!

అవును... ఏపీలో అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రానున్న ఎన్నికల్లో గెలుపుపై కూటమి బలంగా చెబుతున్న నేపథ్యంలో... ఫలితాలు మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే పలుసర్వేలు చెప్పాయి! ఇదే క్రమంలో ఒకటి రెండు సర్వేలు... కూటమికి గెలుపు ఖాయం అని తెలిపాయి! ఈ సమయంలో తెరపైకి వచ్చిన వేణు స్వామి... ఏపీలో ఎన్నికల ఫలితాలపైనా.. మంత్రుల విజయవకాశాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... రానున్న ఎన్నికల్లో ఏపీలో తిరిగి జగన్ అధికారం దక్కించుకుంటారని చెప్పుకొచ్చారు. జగన్ రాశి, నక్షత్రాలు చాలా అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఎలా చూసుకున్నా ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చేది జగనే అని క్లారిటీ ఇచ్చారు! ఇదే సమయంలో కొంతమంది మంత్రులపైనా వేణుస్వామి స్పందించారు. ఇందులో భాగంగా... రోజా, అంబటి, అమర్నాథ్ ప్రస్థావన తెచ్చారు.

ఈ క్రమంలో... రానున్న ఎన్నికల్లో మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లు కాస్త చెమటోడ్చాలని వేణు స్వామి తెలిపారు. వీరు ఆయా నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఎదుర్కోబోతున్నారని విశ్లేషించారు. అయితే వీరి గెలుపోటములపై మాత్రం వేణు స్వామి క్లారిటీ ఇవ్వలేదు! ఇదే సమయంలో నెల్లూరు ఎంపీ స్థానంపైనా వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈసారి నెల్లూరు లోక్ సభ స్థానం విషయంలో టఫ్ ఫైట్ తప్పదని పలువురు అభిప్రాయపడుతున్న వేళ.. ఈ ఎంపీ స్థానం ఫలితాలపైనా వేణు స్వామి స్పందించారు. ఇందులో భాగంగా నెల్లూరు ఎంపీ స్థానం కోసం వైసీపీ నుంచి విజయ సాయిరెడ్డి, టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య పోటీలో ఇద్దరి జాతకం ప్రకారం సాయిరెడ్డికి పది శాతం వరకు అడ్వాంటేజ్ ఉంటుందని తన అంచనాగా వెల్లడించారు.

ఏది ఏమైనా... రానున్న ఎన్నికల్లో జగన్ గెలుపు కన్ ఫాం అని, కొంతమంది మంత్రులకు టఫ్ ఫైట్ ఉంటుందని, నెల్లూరులో సాయిరెడ్డి గెలుస్తారని వేణుస్వామి చెప్పిన ఈ అంచనాలు ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా ఉన్నాయి!!