Begin typing your search above and press return to search.

బాబుతో ఫోన్ కలిపిన వేమిరెడ్డి...!?

వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో ఫోన్ కలిపారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 12:34 PM GMT
బాబుతో ఫోన్ కలిపిన వేమిరెడ్డి...!?
X

వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో ఫోన్ కలిపారు. ఈ ఫోన్ చేయడం వెనక ఉన్నది పార్టీ మారడమే అంటున్నారు. ఫ్యాన్ నీడ నుంచి దూరం జరిగి సైకిలెక్కడానికి వేమిరెడ్డి చూస్తున్నారు అని అంటున్నారు.

అరేళ్ళుగా సైలెంట్ గా తన పని తాను చేసుకుని పోతున్న వేమిరెడ్డి కి వైసీపీ అధినాయకత్వానికి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయా అంటే ఇగోలే కారణం అని అంటున్నారు. 2018 వరకూ వేమిరెడ్డి ఎవరో తెలియదు. ఆయనను రాజ్యసభ మెంబర్ గా వైసీపీ ప్రకటించింది. అలా వేమిరెడ్డి వైసీపీలో కీలకం అయ్యారు.

జిల్లా పార్టీకి ఒక దశలో అన్నీ తాను అయ్యారని చెబుతారు. అటువంటి ఆయన వైసీపీని వీడడం అంటే విస్మయం వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో ఆయనకు విభేదాలు ఉన్నాయి. జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నా అనిల్ విషయంలో ఆయన అసంతృప్తిగానే ఉండేవారు.

ఈ నేపధ్యంలో 2024 ఎన్నికల్లో ఆయన నెల్లూరు ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. తాను కోరుకున్న సీట్లలో అభ్యర్ధులను ప్రకటిస్తేనే పోటీకి సిద్ధం అని ఆయన వర్తమానం పంపించారని ప్రచారంలో ఉంది.అంతే కాదు నెల్లూరు టౌన్ సీటుని తన సతీమణికి ఆయన కోరారని అంటున్నారు.

అదే విధంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ ని తప్పించాలని కోరారు. అయితే అనిల్ ని తప్పించిన హై కమాండ్ ఆ సీటుని మాత్రం అనిల్ అనుచరుడైన డిప్యూటీ మేయర్ ఖలీల్ కి ఖరారు చేసింది. దీంతో రాజుకుంది అగ్గి మంట అని అంటున్నారు. ఆ మీదట వేమిరెడ్డి హై కమాండ్ కి అందుబాటులోకి రాలేదు సరికదా ఇటీవల జగన్ ఢిల్లీకి వెళ్ళినపుడు ఆయన దుబాయ్ వెళ్లిపోయారు అని అంటున్నారు.

ఇక 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేయరని కన్ ఫర్మ్ అయిపోయింది. దాంతో వైసీపీ వేరే పేర్లను చూస్తోంది. మరో వైపు చూస్తే వేమిరెడ్డి వైసీపీ హై కమాండ్ కి ఫోన్ లో అందుబాటులో లేరు కానీ చంద్రబాబుతో మాత్రం ఫోన్ కలిపారు అని అంటున్నారు. దాంతో బాబు కూడా ఆయనను సమాదరించేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

మీ లాంటి వార్ వస్తే మాకు చాలా సంతోషం అని బాబు వేమిరెడ్డితో వ్యాఖ్యానించారని భోగట్ట. మంచి ముహూర్తం చూసుకుని తొందరలోనే వేమిరెడ్డి పసుపు కండువా కప్పుకుంటారు అని తెలుస్తోంది. అంతే కాదు తనతో పాటు నెల్లూరు వైసీపీ నునిచ్ కీలక నేతలను కూడా వేమిరెడ్డి వెంట తీసుకెళ్లే అవకాశం ఉంది అని అంటున్నారు.

నెల్లూరు వైసీపీకి కంచుకోట. అలాంటి చోట ముగ్గురు ఎమ్మెల్యేలు గత ఏడాది పార్టీని వీడిపోయారు. ఇపుడు వేమిరెడ్డి లాంటి ఆర్ధికంగా అన్ని విధాలుగా బలవంతుడైన నేత టీడీపీలో చేరితే కచ్చితంగా టీడీపీ బలం నెల్లూరు జిల్లాలో పెరుగుతుంది అని అంటున్నారు. ఈ పరిణామాలతో నెల్లూరు వైసీపీలో చర్చ సాగుతూంటే టీడీపీ ఫుల్ ఖుషీగా ఉంది అని అంటున్నారు. మొత్తానికి ఇగోలు అటూ ఇటూ ఉండడం వల్లనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని అంటున్నారు. చూడాలి మరి నెల్లూరు వైసీపీలో మరెన్ని ప్రకంపనలు పుట్టుకొస్తాయో.