Begin typing your search above and press return to search.

తేలిన మిస్టరీ.. టీడీపీ నేత వీరయ్య చౌదరిని మర్డర్ చేసింది ఎవరంటే?

పెను సంచలనంగా మారిన తెలుగుదేశం పార్టీ నేత కం మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని ఆయన ఆఫీసులో అత్యంత దారుణంగా హత్య చేసిన వైనం తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 April 2025 4:22 AM
తేలిన మిస్టరీ.. టీడీపీ నేత వీరయ్య చౌదరిని మర్డర్ చేసింది ఎవరంటే?
X

పెను సంచలనంగా మారిన తెలుగుదేశం పార్టీ నేత కం మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని ఆయన ఆఫీసులో అత్యంత దారుణంగా హత్య చేసిన వైనం తెలిసిందే. టీడీపీ కీలక నేత కం మంత్రి లోకేశ్ పాదయాత్ర వేళ.. యాక్టివ్ గా వ్యవహరించిన వీరయ్య.. అంత దారుణంగా హత్య చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. మిస్టరీగా మారిన ఈ హత్య కేసు తాజాగా కొలిక్కి రావటమే కాదు.. హత్య చేసిన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు వీరగంధం దేవేంద్రనాథ్ ను గుర్తించటమే కాదు.. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకూ వీరయ్య చౌదరి హత్యకు కారణం.. అతడి రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేకే ఈ దారుణానికి పాల్పడినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన సాంకేతిక ఆధారాల్ని సేకరించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు ప్రయాణించినట్లుగా చెబుతున్న టూవీలర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇంతకూ ఈ వీరగంధం దేవేంద్రనాథ్ ఎవరు? అతడి రాజకీయ నేపథ్యం ఏమిటి? అన్న ప్రశ్నల్లోకి వెళితే.. 2019లో టీడీపీ యువనేతగా వీరగంధం దేవేంద్రనాథ్ పని చేశారు. ఆ తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పని చేసినా.. వీరయ్య చౌదరి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. దీంతో వీరి మధ్య శత్రుత్వం నడుస్తోంది. ఓవైపు రాజకీయంగా ఇద్దరి మధ్య ఉన్న వైరం.. టీడీపీలోకి వీరగంధాన్ని రాకుండా వీరయ్య చౌదరి అడ్డుకుంటున్నారన్న అనుమానం.. ఇటీవల రొయ్యల చెరువుకు నీటిని మళ్లించే ఇష్యూలో ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం.. కలిసి దేవేంద్రనాథ్ లో పగను పెంచాయని భావిస్తున్నారు.

దీంతో.. వీరయ్య చౌదరిని హత్య చేసేలా కొందరితో కలిసి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. వీరయ్య చౌదరి హత్య కేసులో దేవేంద్రనాథ్ కు ఉప్పుగుండూరుకు చెందిన నల్లూరి రాజా, వినోదరాయునిపాలేనికి చెందిన సుబ్బారావు.. మరో ఇరవై మందిని నిందితులుగా భావిస్తున్న విచారిస్తున్నట్లుగా సమాచారం. హత్య కేసులో కీలకమైన స్కూటీ దొరకింది. మరో ఒకట్రెండు రోజుల్లో వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించిన వివరాల్ని అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.