Begin typing your search above and press return to search.

వారాహి ఎఫెక్ట్ : అయిదుగురులో నలుగురు అవుట్...?

ఇక ఇపుడు జనసేన గ్రాఫ్ బాగా ఈ జిల్లాలలో పెరిగింది. వారాహితో పవన్ దుమ్ము దులిపేసారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 July 2023 8:02 AM GMT
వారాహి ఎఫెక్ట్ :  అయిదుగురులో నలుగురు అవుట్...?
X

ఉమ్మడి గోదావరి జిల్లాలో జోరుగా సాగిన వారాహి యాత్ర బలమైన సామాజిక వర్గాన్ని పోలరైజ్ చేసిందా అంటే అవును అన్న అభిప్రాయం కలుగుతోంది. జనసేన గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఆ పార్టీకి ఇపుడున్న పరిస్థితుల్లో గట్టి జిల్లాలుగా గోదావరి ప్రాంతాలు చెప్పుకోవాలి. పవన్ దూకుడుతో చేసిన ప్రసంగాలతో ఈ జిల్లాలలో సాలిడ్ ఓటు బ్యాంక్ జనసేన వైపు షిఫ్ట్ అయినట్లుగా వర్తమాన రాజకీయ పరిస్థితులను చూసి అంచనా కడుతున్నారు.

అధికార వైసీపీకి ఎటూ యాంటీ ఇంకెంబెన్సీ ఉంది. దానికి తోడు అన్నట్లుగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు ఇపుడు డేంజర్ జోన్ లో పడ్డారని అంటున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలలో ఉన్న నలుగురు మంత్రులలో ఒకే ఒక్క మంత్రి తప్ప అందరీ పవన్ దెబ్బకు ఓటమి బాట పట్టే చాన్సులు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ విషయం చెప్పడానికి ముందు 2019లో ఏమి జరిగింది అన్నది ఒక్కసారి కనుక అంచనా వేసుకుని ఉంటే పరిస్థితి పూర్తిగా అర్ధం అవుతుంది.

ఇక 2019లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 ఎమ్మెల్యే సీట్లు ఉంటే అందులో వైసీపీ 14, టీడీపీ 4, జనసేన ఒకటి గెలుచుకున్నాయి. అదే విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో వైసీపీ 13, టీడీపీ రెండు సీట్లు గెలుచుకున్నాయి. టోటల్ గా వైసీపీ కి 27 సీట్లు దక్కితే టీడీపీకి ఆరు, జనసేనకు ఒక సీటు దక్కాయి.

అప్పట్లో జనసేనకు చాలా నియోజకవర్గాలలో పాతిక ముప్పయి వేలకు తక్కువ కాకుండా ఓట్లు వచ్చాయి. అదే నేపధ్యంలో చాలా చోట్ల వైసీపీ టీడీపీ నుంచి సీట్లు గెలుచుకున్నవి జస్ట్ రెండు నుంచి మూడు వేల మార్జిన్ తో చాలా ఉన్నాయి. ఇక ఇపుడు జనసేన గ్రాఫ్ బాగా ఈ జిల్లాలలో పెరిగింది. వారాహితో పవన్ దుమ్ము దులిపేసారు అని అంటున్నారు. ఇపుడు పొత్తు కనుక ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మొత్తం ఉమ్మడి జిల్లాలలో ఉన్న నలుగురు మంత్రులలో ఒక్కరు తప్ప అంతా ఓటమి బాట పట్టాల్సిందే అని అంటున్నారు.

ఆ ఒక్క మంత్రి లక్కీ ఎవరు అంటే తుని నియోజకవర్గానికి చెందిన దాడిశెట్టి రాజా అని అంటున్నారు. ఆయన ఉన్న నియోజకవర్గంలో జనసేన బలంగా లేదు, అదే టైం లో టీడీపీకి కూడా గతంలో ఉన్న పట్టు ఇపుడు లేదు, పైగా రాజా బాగా స్ట్రాంగ్ గా తునిని పట్టేసుకున్నారు. దాంతో వారాహి యాత్ర ప్రభావం పడని సీటు అదే అంటున్నారు. అలా రాజా సేఫ్ జోన్ లో ఉంటే ఓటమి బాటలో ఉన్న మంత్రులు అయితే తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, పినిపె విశ్వరూప్ అని అంటున్నారు.

అంటే ఏకంగా అయిదుగురు మంత్రులు డేంజర్ జోన్ లో ఉన్నారన్న మాట. ఇక ఇందులో కారుమూరి తణుకులో జస్ట్ రెండు వేల ఓట్లతోనే గెలిచారు. ఇపుడు అక్కడ పొత్తులు ఉంటే కారుమూరి కి ఇబ్బాందే అని అంటున్నారు. ఇక్కడ 2019లో జనసేన మద్దతు ఇచ్చిన బీఎస్పీ పోటీ చేస్తే పాతిక వేల ఓట్లు వచ్చాయి. సరిగ్గా వనితకు కూడా పాతిక వేల ఓట్ల మెజారిటీ వచ్చింది.

కొవ్వూరులో టీడీపీకి చెందిన మాజీ మంత్రి జవహర్ బలంగా ఉన్నారు. కొత్తగా జనసేనలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు చేరారు. దాంతో ఇంకా బలం పెరిగింది అని అంటున్నారు. సో అలా వనితకు కొవ్వూరు సీట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు అని అంటున్నారు. అదే విధంగా అమలాపురంలో మంత్రి పినిపె విశ్వరూప్ ని తీసుకుంటే ఆయనకు కూడా ఈసారి షాక్ తప్పకపోవచ్చు అని అంటున్నారు.

ఇక్కడ 2019లో పోటీ చేసిన జనసేనకు ఏకంగా 46వేల ఓట్లు వచ్చాయి. మంత్రి విశ్వరూప్ కి పాతిక వేల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. పొత్తులు ఉంటే విశ్వరూప్ ని ఓడించడం ఈజీ అని ఈ లెక్కలు చెబుతున్నాయి. టీడీపీ నేత మాజీ అయితాబత్తుల ఆనందరావు స్ట్రాంగ్ గా ఉన్నారు. అలాగే జనసేన గ్రాఫ్ ఇంకా పెరిగింది అని అంటున్నారు. సో అమలాపురం సీటు వైసీపీ నుంచి జారుతోందా అంటే ఇపుడున్న లెక్కలు అదే నిజం అంటున్నాయి.

ఇక తాడేపల్లిలో చూస్తే దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్నారు. ఆయనకు 2019లో పదహారు వేల మెజారిటీ వచ్చింది. అయితే ఇక్కడ జనసేన 2019లోనే స్ట్రాంగ్ అని నిరూపించుకుంది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ కి 36 వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. ఇపుడు ఆ పార్టీ గ్రాఫ్ ఇంకా పెరిగింది.

టీడీపీ నుంచి పోటీ చేసిన ఈలి నాని కూడా బలమైన నేతగా ఉన్నారు. పొత్తు కుదిరితే ఇక్కడ వైసీపీ చిత్తు కాక తప్పదు అనే అంటున్నారు. ఇలా అయిదుగురు మంత్రులలో నలుగురు ఓటమి బాటన ఉన్నారనే అంటున్నారు. ఇక ఎమ్మెల్యేలు చూస్తే 22 మందిలో చాలా మందికి టీడీపీ జనసేన పొత్తు కడు ఇబ్బందికరం అనే లెక్కలు చెబుతున్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.