Begin typing your search above and press return to search.

ఓ రామా.. మొక్కలు అడుగుతున్నాయ్ నీవెక్కడ అని..? మళ్లీ భూమ్మీదకు రావా?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం శ్రీరాముడు ఎంత ప్రసిద్ధుడో.. వన జీవి రామయ్య అంత ప్రసిద్ధులు.. ఇంతకూ ఎవరీయన అంటే..

By:  Tupaki Desk   |   12 April 2025 7:00 PM IST
ఓ రామా.. మొక్కలు అడుగుతున్నాయ్ నీవెక్కడ అని..? మళ్లీ భూమ్మీదకు రావా?
X

ఒక మొక్క నాటి అది పెరిగి పెద్దదైతేనే మనం ఎంతో సంతోషంగా ఉంటాం. అలాంటిది ఆయన జీవితాంతం మొక్కలు నాటుతూనే ఉన్నారు. వాటినే ఊపిరిగా భావించారు. ఈ క్రమంలో అనేకసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన కుటుంబాన్నే మొక్కలు నాటడానికి అంకింతం చేశారు. ఇప్పుడు ఆ మొక్కల్లో ఒకడై వాటిని వీడిపోయారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం శ్రీరాముడు ఎంత ప్రసిద్ధుడో.. వన జీవి రామయ్య అంత ప్రసిద్ధులు.. ఇంతకూ ఎవరీయన అంటే.. నేచర్ ను అత్యంత ప్రేమించే అరుదైన వనజీవి. ఎక్కడో ఖమ్మం జిల్లాలో ఉన్న ఇతడి ప్రత్యేకతను గుర్తించి పద్మ శ్రీ అవార్డు అందించింది. అలాంటి రామయ్య జీవితాన్ని మొక్కలకు అంకితం చేసారు. 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

వనజీవి అనే పేరు ఇంటి పేరుగా మార్చకున్నారు రామయ్య. మొక్కలంటే అంత ప్రేమ చూపించారు. 2017లో పద్మశ్రీ అవార్డు అందుకున్న రామయ్య.. కొన్నాళ్లుగా అస్వస్థతతో ఉన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శనివారం తెల్లవారుజామున గుండె పోటు రావడంతో మృతి చెందారు.

ఎవరైనా చిన్నప్పుడో, ఒక వయసుకు వచ్చాకో మొక్కలపై ప్రేమ చూపిస్తారు. కానీ, రామయ్య మాత్రం జీవితాంతం ఆ ప్రేమను కొనసాగించారు. ఈయన స్వగ్రామం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు.

కాగా, రామయ్య మృతి వార్త తెలిసి తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మంత్రులు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అనేక రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన జీవితం యువతకు ఆదర్శం అని కొనియాడారు.