Begin typing your search above and press return to search.

భార్య హత్య కేసులో కాంగ్రెస్‌ నేత కుమారుడు అరెస్ట్‌!

దీంతో లహరి గుండెపోటు తో చనిపోలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందట

By:  Tupaki Desk   |   29 July 2023 6:54 PM GMT
భార్య హత్య కేసులో కాంగ్రెస్‌  నేత కుమారుడు అరెస్ట్‌!
X

భార్యను హత్య చేసి.. దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి.. పోలీసుల ను తప్పుదోవపట్టించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ నేత కుమారుడు అరెస్ట్ అయ్యాడు. ఈ కేసు లో నిందితుడు నల్గొండ వాసి కాగా.. నివాసం ఉంటోంది హైదరాబాద్ లో!

వివరాళ్లోకి వెళ్తే... నల్గొండ జిల్లా కు చెందిన కాంగ్రెస్ నేత రంగసాయి కుమారుడు వల్లభ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నాడు. కాగా, వల్లభ్ రెడ్డికి ఏడాది క్రితం లహరి అనే యువతితో వివాహం జరిగింది. వీరిద్దరూ కలిసి హైదరాబాద్ లోని హిమాయత్‌ నగర్‌ లో నివాసం ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో తరచూ వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవని అంటున్నారు. ఈ క్రమంలో... జులై 14వ తేదీన గుండెపోటు వచ్చిందంటూ లహరి ని ఆస్పత్రికి తీసుకొని వెళ్లాడు వల్లభ్ రెడ్డి. అయితే అప్పటికే ఆమె మృతిచెందింద ని వైద్యులు నిర్ధారించారు.

ఈ సమయం లో గుండెపోటు తోనే లహరి చనిపోయిందని అందర్నీ నమ్మించే యత్నం చేశారట వల్లభ్ రెడ్డి, ఆయన కుటుంబం! అయితే మృతురాలి తండ్రికి అనుమానం రావడంతో నారాయణగూడ పోలీసుల కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దీంతో లహరి గుండెపోటు తో చనిపోలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందట. ఇదే సమయం లో ఆమె తలకు తీవ్రగాయం కావడంతోనే చనిపోయిందని, కడుపు లో కూడా తీవ్ర గాయాలయ్యాయని తేలిందని పోలీసులు చెబుతున్నారు!

దీంతో అతని పై సెక్షన్ 302 మర్డర్, 201 సాక్షాల తారుమారు కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండు కు తరలించామని నారాయణగూడ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు.

కాగా… జులై 13వ తేదీన లహరి తో గొడవపడిన వల్లభ్.. ఆమెను గోడకేసి కొట్టాడని అంటున్నారు. దీంతో ఆమె తలకు తీవ్రగాయమైనట్లు పోలీసుల విచారణ లో తేలిందట. ఈ నేప‌థ్యంలో వ‌ల్లభ్‌ ను క‌ఠినంగా శిక్షించాల‌ ని ల‌హ‌రి త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

మరోపక్క లహరి చనిపోయిన అనంతరం ఆమె దినకర్మకు వల్లభ్ రెడ్డి.. 10 వేల మందికి భోజనాలు కూడా పెట్టడం గమనార్హం. లహరి పేరెంట్స్‌ పై కూడా వల్లభ్‌ రెడ్డి ఒత్తిడి తెచ్చినట్టు చెబుతున్నారని సమాచారం!