Begin typing your search above and press return to search.

వంశీ విసిగిపోయారా... బయటకు వస్తే అదే చేస్తారట ?

వల్లభనేని వంశీ పేరు ఇపుడు ఏపీ అంతటా మారుమోగుతోంది. ఒకనాడు టీడీపీలో డైనమిక్ లీడర్ గా ఉండేవారు.

By:  Tupaki Desk   |   19 May 2025 9:31 AM IST
Vallabhaneni Vamsi in Political Limbo Rift with YSRCP
X

వల్లభనేని వంశీ పేరు ఇపుడు ఏపీ అంతటా మారుమోగుతోంది. ఒకనాడు టీడీపీలో డైనమిక్ లీడర్ గా ఉండేవారు. ఆయన వరసగా రెండు సార్లు గన్నవరం అసెంబ్లీ సీటు నుంచి గెలిచి తన సత్తా చాటుకున్నారు. అలాంటి వంశీ వైసీపీలో చేరి తన పొలిటికల్ కెరీని ఇబ్బందుల్లోకి నెట్టుకున్నారని అంటున్నారు.

సొంత సామాజిక వర్గం ఆయనను దూరం పెట్టింది. వైసీపీలో కూడా ఎన్నికల్లో ఓటమి చెందాక ఆయన దూరంగా ఉంటున్నారు. పార్టీ తరఫున కూడా సరైన గుర్తింపు లేదని ఆయన అనుచరులు అంటున్నారు. ఇక వంశీ ఫిబ్రవరి 13న అరెస్టు అయ్యారు. ఆయన అరెస్ట్ అయిన తరువాత జగన్ విజయవాడ జైలుకు వచ్చి ఒకసారి పరామర్శించారు. ఆ తర్వాత ఆయన గురించి వైసీపీ పెద్దలు పెద్దగా వాకబు చేసింది లేదని పట్టించుకున్నది లేదని అంటున్నారు.

ఈ మధ్యలో వంశీ మీద వరసగా కేసుల మీద కేసులు పెడుతూ బెయిల్ వచ్చినా కూడా ఇంకా జైలులోనే ఉండేలా చేస్తున్నారు. దాంతో పాటు ఆయన ఆరోగ్యం కూడా ఇబ్బందులో ఉంది. ఆయన రూపు రేఖలు కూడా బాగా మారిపోయాయి.

ఈ నేపధ్యంలో వంశీ మానసికంగా కూడా చాలా ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. వంశీ అనుచరుల విషయం తీసుకుంటే వైసీపీ వారు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. దాంతో వంశీ బెయిల్ మీద బయటకు వస్తే ఏమి చేస్తారు అన్న చర్చ సాగుతోంది.

ఆయన బయటకు వచ్చిన మీదట వైసీపీకి దూరం అవుతారని అంటున్నారు. పోసాని క్రిష్ణ మురళి వంటి వారు వైసీపీకి ఇప్పటికే దూరం అయ్యారు. ఇపుడు వంశీ కూడా అదే విధంగా చేస్తారు అని అంటున్నారు. మరి ఆయన అంతటితో సరిపెడతారా లేక వైసీపీ అధినాయకత్వం మీద విమర్శలు ఏమైనా చేసి మరీ షాకులు ఇస్తారా అన్న చర్చ సాగుతోంది.

ఇక గన్నవరంలో చూసుకుంటే వంశీ ప్లేస్ లో వైసీపీ ఇంచార్జి గా వేరే వారికి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ చూస్తోంది అని అంటున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉంటూ వస్తున్న సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు కుమార్తెకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు.

ఈ రకంగా జరుగుతున్న కార్యక్రమాల గురించి కూడా తెలుసుకుని వంశీ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుట. మరి వంశీ వైసీపీకి దూరం అవుతారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత ఉందన్నది ఆయన బెయిల్ మీద వచ్చిన తరువాతనే తెలుస్తుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే వంశీ 2024 ఎన్నికల సమయంలోనే చెప్పేశారని ఒకవేళ తాను ఓటమి చెందితే రాజకీయాల నుంచి దూరం అవుతానని మళ్ళీ పోటీ చేయను అని ఆయన చెప్పారని అంటున్నారు. సో వంశీ ఇక పాలిటిక్స్ కి పూర్తిగా దూరం అవుతారా లేక కొంతకాలం ఆగి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తారా అన్నది చర్చగా ఉంది.